GHMC : వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉంది
జీహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్
- ప్రపంచ హెరిటేజ్ దినోత్సవ సందర్భంగా జిహెచ్ఎంసి ఆద్వర్యంలో గురువారం దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సాలార్ జాంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్ లో కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటు జోనల్ కమిషనర్లు, హెచ్ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 18 :
వారసత్వ సంపదను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. ప్రపంచ హెరిటేజ్ దినోత్సవ సందర్భంగా జిహెచ్ఎంసి ఆద్వర్యంలో గురువారం దారుల్ షిఫా నుండి ప్రారంభమైన హెరిటేజ్ వాక్ సాలార్ జాంగ్ మ్యూజియం మీదుగా ఉస్మానియా ఆసుపత్రి వద్ద ముగిసింది. హెరిటేజ్ వాక్ లో కమిషనర్ రోనాల్డ్ రోస్ తో పాటు జోనల్ కమిషనర్లు, హెచ్ ఓ డి లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ మాట్లాడుతూ... హైదరాబాద్ నగరంలో ప్రాముఖ్యత గల వారసత్వ సంపదను కాపాడేందుకు విశేష కృషి చేస్తున్నట్లు, వారసత్వ సంపదను బావితరాల వారికి అందించాలనే సంకల్పంతో చార్మినార్ పెడెస్ట్రెయిన్ ప్రాజెక్టు అభివృద్ది చేయడం జరిగిందన్నారు.
హెరిటేజ్ వాక్ లో 1908 లో మూసి వరదల సందర్భంగా నగరంలో చేపట్టే అభివృద్ధి నీ స్ఫూర్తి గా తీసుకొని ఈ వాక్ ను నిర్వహించడం జరిగిందని ఈ వాక్ సందర్భంగా పాత మున్సిపల్ భవనాన్ని అదే విధంగా సాలార్ జంగ్ మ్యూజియం గతంలో ఏ విధంగా ఉండే ప్రస్తుత ఏ విధంగా ఉందో ఫోటో ల ద్వారా చూడడం జరిగిందని హెరిటేజ్ నగరంలో ఉన్న ప్రాముఖ్యత పై ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
పున:నిర్మాణ, పునరుద్ధరణ చేపట్టే ఆరు కమాన్ లు రాణీ గంజ్ కమాన్, షేక్ ఫెయిజ్ కమాన్, చట్ట బజార్ కమాన్, దీవాన్ డేవడి కమాన్, దబీర్పూర కమాన్, హుస్సేన్ అలం కమాన్లు అభివృద్ధి చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ వాక్ లో జోనల్ కమిషనర్లు రవి కిరణ్, స్నేహ శబరిష్, అభిలాష అభినవ్, పంకజ, వెంకన్న, అడిషనల్ కమిషనర్ కె. శ్రీవాత్సవ్, చంద్రకాంత్ రెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, చీఫ్ ఎంటమాలజి ఆఫీసర్ డాక్టర్ పద్మజ, డాక్టర్ అబ్దుల్ వాకిల్, డాక్టర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


