తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం
తెలంగాణలోని పేదలకు ఉచితంగా వైద్యం అందించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడికి ఒక హెల్త్ కార్డు ఇచ్చి, హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తాం. బ్లడ్ గ్రూప్ నుంచి చిన్న, పెద్ద ఆరోగ్య సమస్యలను అందులో పొందుపరుస్తామని తెలిపారు. దీంతో ఏ ఆసుపత్రికి వెళ్లినా.. గతంలో ఎలాంటి వైద్యం అందించారు. ఇప్పుడు ఏం చేయాలనేది తెలుస్తాయని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా ప్రపంచ దేశాల నుంచి చాలా మంది బెస్ట్ వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు.
Read More Telangana I పేట ఎవరి సొంతం..!?
Views: 0


