శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందితే అంతా శుభమే 

దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్

శ్రీశ్రీ చినజీయర్ స్వామి దివ్య మంగళ ఆశీస్సులతో శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు చేత మొదటి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందితే అంతా శుభమే 

జయభేరి, చింతపల్లి :
శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అంతా శుభమే జరుగుతుందని, శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో తరించి స్వామివారి అనుగ్రహం పొందాలని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ పేర్కొన్నారు. సోమవారం చింతపల్లి మండలం వింజమూరు గ్రామపంచాయతీ పరిధిలోని వైపి నగర్ వద్ద గల శ్రీ శ్రీ హరి హర క్షేత్రం మొదటి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలలో భాగంగా మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, తన అనుచరులతో కలిసి క్షేత్రాన్ని సందర్శించి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

a709d8f8-c051-48a8-a088-83f4ad5ad6d1

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

మూడు రోజులపాటు శ్రీశ్రీ చినజీయర్ స్వామి దివ్య మంగళ ఆశీస్సులతో శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు చేత మొదటి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించారు. కలియుగ హరిహర క్షేత్రం ఆవరణలోని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీ రామలింగేశ్వర స్వామి  కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను ఆదివారం ఆలయ కమిటీ చైర్మన్ కావేటి శ్రీనివాసరావు, సుధా, కావేటి వంశీ, సుష్మ దంపతులచే నిర్వహించగా, వారిచే సోమవారం ప్రత్యేక పూజలతో పాటు చక్రస్నానం, హోమం నిర్వహించారు. 

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

e4e70f34-22af-49b6-9ba8-0238efd782cd

Read More Anganwadi I అద్దె భ‌వ‌నాల్లోనే అంగ‌న్‌వాడీలు

ఆలయ కమిటీ నిర్వాహకులు మొదటి వార్షిక బ్రహ్మోత్సవానికి అన్ని రకాల వసతులను సమకూర్చి కన్నుల పండుగగా కార్యక్రమాలను చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అన్ని రకాల పూజలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. మూడు రోజులు పాటు క్షేత్ర ప్రాంగణంలో మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించామని, శనివారం నుంచి మొదలైన బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగిసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ కావేటి శ్రీనివాసరావు కావేటి వంశీ తెలిపారు. బ్రహ్మోత్సవ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కావేటి శ్రీనివాసరావు, సుధ, కావేటి వంశీ, సుష్మ, తెరటిపల్లి గురునాథం, విజయమ్మ, నరేందర్, యాదమ్మ, గ్యార వెంకటయ్య కొరివి రాధాకృష్ణ తో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున  పాల్గొన్నారు.

Read More Election I పార్టీల మేనిఫెస్టోల మతలబు ఏమిటి?

Views: 0