ఆర్థిక అక్షరాస్యత దిశగా అందరూ అడుగులు వేయాలి... డీఆర్ డీవో సాంబశివరావు

  • మేడ్చల్ జిల్లా ఉద్దమర్రి లో ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన
  • ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

ఆర్థిక అక్షరాస్యత దిశగా అందరూ అడుగులు వేయాలి... డీఆర్ డీవో సాంబశివరావు

జయభేరి, మే 21:
ఆర్థిక అక్షరాస్యత ను పెంపొందించే దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని, అదేవిధంగా గ్రామీణ ప్రాంత ప్రజలందరూ బ్యాంకులు అందిస్తున్న సేవల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా రూరల్ డెవలప్మెంట్ అధికారి సాంబశివరావు అన్నారు.

మూడు చింతల పల్లి మండలం ఉద్దమర్రి గ్రామంలో ఎస్ ఎస్ టీ  ఎన్జీవో సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టు మిషన్ సెంటర్ ను ఆయన పరిశీలించారు. అనంతరం ఆర్థిక అక్షరాస్యత పై ప్రజలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలన్నీ బ్యాంకుల ద్వారా ప్రజలందరికీ చేరవేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పిస్తున్న సొసైటీ ఫర్ సోషల్  ట్రాన్స్ఫర్మేషన్ (ఎస్ ఎస్ టీ) ఎన్జీవో సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. సుకన్య  సమృద్ధి యోజన పథకంలో భాగంగా 10 ఏళ్ల లోపు  బాలికలకు పొదుపు ఖాతాలను ప్రారంభించి, 100% సాధించిన గ్రామంగా ఉద్ధ మర్రి గ్రామాన్ని తీర్చిదిద్దాలని గ్రామ అధికారి, సిబ్బందికి సూచించారు.

Read More వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక చేకూర్పులో భాగంగా ఆర్థిక అక్షరాస్యతను ప్రజల్లో పెంపొందించడానికి ఆర్థిక మోసాలను అరికట్టడానికి, మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు  ఎస్ ఎస్ టీ జిల్లా కోఆర్డినేటర్ అంబిక, కీసర సి ఎఫ్ ఎల్ విశ్వనాథ్ లు వివరించారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్ సింగ్, బిపిఎం రమేష్, షరీఫా, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన  పద్మశాలి కులస్తులు