హైదరాబాద్ :
జిల్లాలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు.
మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ. 16,19,000 నగదుతోపాటు రూ.1,81,689 విలువైన ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు రూ.69,000/-, పోలీసు అధికారులు రూ.15 లక్షల 50 వేల నగదు, రూ.1,81,689/- విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. 13 మందిపై ప్రొహిబిషన్ కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్టు చేశారు. నగదు, ఇతర వస్తువులకు సంబంధించి ఇప్పటి వరకు 156 ఫిర్యాదులను విచారించి పరిష్కరించామని, 124 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని రోనాల్డ్ రోస్ తెలిపారు.