విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

ఆడపిల్లలకు ఆపదలో షిటీం ఉంది... ప్రేమ పేరుతో మోసపోవద్దు... గజ్వేల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.సైదా

విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

జయభేరి, గజ్వేల్, సెప్టెంబర్ 30 :
సైబర్‌ నేరాలపై విద్యార్థినులు అవగాహన పెంచుకోవాలని, ఆకతాయిలు వేధిస్తే వెంటనే షీటీంలకు సమాచారం అందించాలని గజ్వేల్ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదా సూచించారు. సైబర్‌ నేరాలు, షీటీంలపై పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. 

విద్యార్థినులు సెల్‌ ఫోన్ లకు దూరంగా ఉంటూ క్రమశిక్షణతో చదివి తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని సూచించారు.మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం షీ టీం ఏర్పాటు చేశామని, ఏదైనా ఆపదలో ఉంటే 100 నంబర్‌కు డయల్‌ చేయాలని సూచించారు. సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మోసాలకు గురైతే 1930 నంబర్‌కు డయల్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు షీ టీం బృందం, ఏఎస్ఐ శ్రీరాములు, కానిస్టేబుళ్లు శ్యామల, రామచంద్రారెడ్డి, మహేష్ పాఠశాల సిబ్బంది విద్యార్థినులు పాల్గొన్నారు.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

d6afd080-041b-4921-8cdb-c5171caf3bcf

Read More Telangana I క్యాబినెట్ భేటీతో.. బీఅర్ స్ లో పెరిగిన దడ.!?

Views: 0