భారీ బందోబస్త్‌తో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

  • సాయి ఐశ్వర్య కాలనీలో హై టెన్షన్
  • అడ్డుకున్న బీఆర్ఎస్ కార్పోరేటర్లు, నాయకుల అరెస్ట్

భారీ బందోబస్త్‌తో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు

జయభేరి, మేడిపల్లి :
పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అధికారులు కూల్చివేతలు చేస్తున్నారని సమాచారం అందడంతో హుటాహుటిన పిర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్ రెడ్డి అక్కడికి చేరుకొని కూల్చివేతలు ఆపమని కక్ష పూరిత రాజకీయాల మధ్యలో పేదలు బలిఅవుతున్నారని వారికి విన్నపం చేసిన వినకుండా కూల్చివేతలు జరిపారు. 

ఈ చర్యలకు వ్యతిరేకంగా మేయర్ మరియు బాధితులు ఎం ఆర్ ఓ ని అడ్డుకొని నిరసన తెలిపే క్రమంలో స్వల్ప తొక్కీసలాట జరగడంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం మేయర్ మాట్లాడుతూ... మాజీ ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి కక్షపూరిత రాజకీయంలో భాగంగా నేడు అమాయకుల ఇల్లు కూల్చివేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క కక్ష పూరిత రాజకీయాలు బయటపడ్డవని అన్నారు.

Read More Telangana I కాంగ్రెస్ పార్టీ ఓకే ఆశాదీపంలా కనిపిస్తోంది

Views: 0