గత బీఆర్ఎస్ పాలనే కాంగ్రెస్ కొనసాగిస్తోంది - మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్
అమలు కానీ హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తుంది
ఈటెల సమక్షంలో కమలం గూటికి చేరిన శామీర్ పేట్ మాజీ ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్
జయభేరి, ఏప్రిల్ 16 :
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే చెత్త బుట్టలో వేసినట్లే అని, సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మల్కాజ్ గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద వాళ్ల బతుకులు బాగుపడాలంటే బీజేపీ కే పట్టం కట్టాలని ఆయన కోరారు. తుంకుంట మున్సిపల్ కేంద్రంలో ఉమ్మడి శామీర్ పేట్ మాజీ ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్ తో పాటు ఈశ్వర్ గౌడ్, పరమేష్ యాదవ్, మహేష్ యాదవ్, పవన్ యాదవ్, రాంచందర్, వినయ్ జెన్, పవన్ , సూరి, కస్తూరి నాగులు, నర్సింగరావు,యోగితో పాటు 100మంది నేతలు ఈటెల రాజేందర్ సమక్షంలో బీజేపీ గూటికి చేరారు. అనంతరం ఈటెల మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ పాలనకు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పాలనకు ఏ మాత్రం తేడా లేదని, కేసీఆర్ ఎలాంటి రాజకీయాలు చేశారో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాదారణ లేదని, డబ్బు, పదవుల ఆశ చూపెట్టి నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటైన నెరవేర్చార అని ప్రశ్నించారు.
17 సీట్లు గెలిపిస్తే హామీలన్నీ నెరవేరుస్తా అని చెపుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచాక ఆ హామీ నిలబెట్టుకుంటారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆ ఓటు విలువ జీరో అని అన్నారు. పేదవాళ్ళ బతుకులు బాగు పడాలంటే బీజేపీ తోనే సాధ్యం అన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 4 కోట్ల మంది పేదవారికి ఇళ్ళు కట్టించి ఇచ్చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు చేయక పోతే ఆ బాధ్యత తాము తీసుకుంటాం అని మోడీ నిర్ణయించడం గొప్ప విషయం అని గుర్తు చేశారు. పేదల ఇంటి నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించక పోతే కేంద్ర ప్రభుత్వం ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఈ సారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి ఎంపీగా తనను గెలిపించాలని ఈటెల వేడుకున్నారు. అనంతరం మాజీ ఎంపిపి చంద్రశేఖర్ యాదవ్ మాట్లాడుతూ శివాజీ మహరాజ్, వివేకానంద స్ఫూర్తితో ధర్మం కోసం పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈటెల రాజేందర్ కు ఓటు వేస్తే ప్రధాని మోడీ కి ఓటు వేసినట్లే అని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతానికి శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, మల్కాజ్ గిరి బీజేపీ పార్లమెంట్ ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, తుంకుంట మున్సిపాలిటీ బిజెపి అధ్యక్షుడు నర్సింహారెడ్డి, రాష్ట్ర నాయకులు ఈశ్వర్ గౌడ్, బుద్ధి శ్రీనివాస్, మూడు చింతల పల్లి పార్టీ అధ్యక్షుడు నందల శ్రీనివాస్, మండల సీనియర్ నాయకులు మైసయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post Comment