Congress : అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా
బీఆర్ఎస్ ఉనికి లేని పార్టీ... కాంగ్రెస్ తోనే భవిష్యత్ : తోటకూర జంగయ్య యాదవ్
- బీఆర్ ఎస్ పార్టీ కి రోజు రోజుకు ఆదరణ తగ్గుతుందని, ఆ పార్టీపై నమ్మకం లేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.
జయభేరి, ఏప్రిల్ 21 :
అభివృద్దే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర జంగయ్య యాదవ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ లు అన్నారు. శామీర్ పేట్ మండలం అలియబాద్ లో జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన కార్యకర్తల కు వారు కండువాలు కప్పి ఆహ్వానించారు.

బీఆర్ ఎస్ పార్టీ కి రోజు రోజుకు ఆదరణ తగ్గుతుందని, ఆ పార్టీపై నమ్మకం లేకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. కాగా పార్టీలో చేరిన వారిలో నీరుడి బాలేష్, కనకాల కాళిదాసు, కనకాల సుధాకర్, తడెం ఎల్లం, బత్తుల ప్రవీణ్ కుమార్, బొమ్మర్ల అనీల్ కుమార్, భరత్, కనకాల మల్లేష్, పల్లె ప్రకాష్, మేడిపల్లి ప్రకాష్, వరప్రసాద్, వేణు ఉన్నారు. కాగా ఈ కార్యక్రమంలో అలియబాద్ మాజీ ఎంపిటిసి ఇప్ప మంజుల మాధవరెడ్డి, మేడి మల్లేష్, గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కమటం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Post Comment