రైతు శ్రేయస్సే ద్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలి 

ఎమ్మెల్యే రేవూరి 

రైతు శ్రేయస్సే ద్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలి 

జయభేరి, పరకాల, నవంబర్ 23: 
ప్రతీ రైతు కుటుంబం ఆనందంగా ఉండాలని, రైతు శ్రేయస్సే ప్రధాన ధ్యేయంగా సహకార సంఘాలు పనిచేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి  కోరారు. పరకాల పరిధిలోని సంగెం, ఊకల్, కాపుల కనపర్తి రైతు సహకార సంఘాల పాలక వర్గాల సభ్యులతో శనివారం పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  హన్మకొండ జిల్లా భీందేవరపల్లి మండలంలోని ముల్కనూరు గ్రామంలో ఉన్న ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంక్ ను సందర్శించి పరిశీలించారు.   

అనంతరం ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంక్ సమావేశం మందిరంలో ముల్కనూరు సొసైటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే ఏ ప్రవీణ్ రెడ్డి  బ్యాంకు అభివృద్ది చెందిన తీరును ప్రొజెక్టర్ ద్వారా వివరించారు. ప్రతీ రైతు సహకార సంఘం పాలక మండలి సభ్యులు నిబద్ధతతో పని చేసి పరకాల ఎంఎల్ఏ  రేవూరి ప్రకాశ్ రెడ్డి  ఆలోచనలకు అనుగుణంగా పని చేసి రైతుల సంక్షేమానికి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.    

Read More "వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 

ఈ సందర్భంగా పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ... రైతుల కోసం రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవస్థే రైతు సహకార వ్యవస్థ అని రైతు శ్రేయస్సు కోసం విశ్వనాథరెడ్డి  మల్కనూర్ సొసైటీ ఏర్పాటు చేశారని అన్నారు. ముల్కనూర్ సొసైటీ1956 లో 379 మంది సభ్యులతో ఏర్పడ్డ సొసైటీ ఈ రోజు 7641మంది సభ్యులు సుమారు 18కోట్ల మూలధనంతో అభివృద్ధి చెందినదని అన్నారు. వ్యవసాయం పట్ల నిబద్ధత, రైతుల అవసరాలకు అనుగుణంగా రుణాల మంజూరు. వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువుల సరఫరా చేయడం రైతుల పంటలను తగిన ధరలకు విక్రయించే అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. 

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

WhatsApp Image 2024-11-23 at 20.18.47

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

రైతుల మధ్య సహకార భావనను పెంచడం, సమర్థమైన నిర్వహణ విధానాలు రైతుల జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంపై దృష్టి. ముల్కనూర్ సొసైటీ విజయానికి కారణాలుగా కనిపిస్తున్నాయని అన్నారు. సమిష్టిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిదర్శనం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అని వారి స్ఫూర్తితో ప్రతి రైతు సహకార సంఘం పనిచేసెలా ఆయా పాలకవర్గాలు కృషి చేయాలని అన్నారు. 1956లో సహకార సంఘాలను నాటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. రైతులు పెట్టుబడి కోసం ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కాకుండా రుణాలు అందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సహకార సంఘాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. 

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు

మల్కనూరు సహకార సంఘం స్ఫూర్తి రైతు సహకార సంఘాల స్ఫూర్తి కొనసాగించాలని కోరారు. రాజకీయ ప్రక్రియకు దూరంగా, క్షేత్ర స్థాయిలో అందరినీ కలుపుకుపోయి కొన్ని కార్యక్రమాలను అమలుచేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని అన్నారు. రైతు సహకార సంఘాలు ఆలోచనా ధోరణిని, కార్యక్షేత్రాన్ని మరింత క్రియాశీలంగా మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గ్రామ స్థాయిలో సహకార సంఘాలను రాజకీయ పార్టీలకు అతీతంగా తమ సభ్యుల ప్రాథమిక హక్కులపై పని చేసే స్వభావాన్ని తప్పకుండా పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సహకార సంఘాల సమష్టితత్వానికి, బలానికి ఉండే ప్రయోజనమేమిటి? రైతు సహకార సంఘాలు తమ సభ్యుల నిత్య జీవిత, వృత్తిపరమైన సమస్యలపై మాట్లాడనంత కాలం వారి సమస్యలు పరిష్కారం కావు.

Read More బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం కోఆర్డినేటర్ గా గోర శ్యాంసుందర్ గౌడ్.

రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఈ సహకార సంఘాల స్ఫూర్తిని కాపాడడానికి విచక్షణను ప్రదర్శించాలని అన్నారు. సమిష్టిగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి నిదర్శనం ముల్కనూర్ సహకార గ్రామీణ బ్యాంక్ అని వారి స్ఫూర్తితో ప్రతి రైతు సహకార సంఘం పనిచేయాలని సహకార సంఘాలు రైతు సంక్షేమానికి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, రైతుల కోసం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ సహకార సంఘాలు అని దురదృష్టవశాత్తు రైతుల రక్షణకు కృషి చేయాల్సిన రైతు సహకార సంఘాలు రైతు భక్షకులుగా మారాయని అన్నారు. సొసైటీ లు రాజకీయాలకు నిలయంగా మారి వాటిని నిర్వీర్యం చేస్తున్నారని రాబోయే రోజుల్లో రాజకీయాలకతీతంగా పాలక వర్గం ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆలోచనలో ఉందని అన్నారు. అనంతరం ముల్కనూరు సొసైటీ నిర్వహణలో ఉన్న కాటన్ గోదాం, జిన్నింగ్ మిల్, ముల్కనూర్ డైరీ నిర్వహణ తీరును పరిశీలించారు.

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Latest News

జ్యోతిరావు పూలే జయంతి... జ్యోతిరావు పూలే జయంతి...
సామాజిక సమానత్వానికి, మహిళా విద్యకు మార్గదర్శకులు జ్యోతిరావు పూలే. అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త  జ్యోతిరావు...
గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
జై బాపు -జై భీమ్ -జై సంవిధాన్ అభియాన్
జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...
"వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్" బ్రాండ్ అంబాసిడర్‌గా : ప్రొఫెసర్ యుద్ధవీర్ కట్టా 
తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి