కొల్తూర్ గ్రామంలో స్వచ్చదనం - పచ్చదనం

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలి - నీరజ

కొల్తూర్ గ్రామంలో స్వచ్చదనం - పచ్చదనం

జయభేరి, ఆగస్టు 9:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్మాతకంగా చేపడుతున్న స్వచ్చదనం పచ్చదనం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని డిప్యూటీ సీఈవో నీరజ పిలుపునిచ్చారు.. స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామంలో నిర్వహించిన స్వచ్చదనం - పచ్చదనం కార్యక్రమంలో డిప్యూటీ సీఈవో నీరజ ఎంపీడీవో వత్సలాదేవితో కలిసి పాల్గోన్నారు. అదేవిదంగా గ్రామంలో పర్యటించి ఇంటింటి ఫీవర్ సర్వే తీరును పరిశీలించారు. ఇక అంగన్ వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారాన్ని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం అనేది పరిశుభ్రత మరియు పర్యావరణానికి సంబంధించినదని  అన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రజలదే అని, దీని  వ్యాధుల భారిన పడకుండా సీజనల్ వ్యాధులను నివారించవచ్చునన్నారు. అలాగే ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని రక్షించి కాలుష్యాన్ని నివారించవచ్చని అన్నారు. మొక్కలతోనే జీవవైవిధ్యం ఆధారపడి ఉందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని తెలిపారు, అనంతరం కొల్తూర్ గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, పంచాయితీ కార్యదర్శి హర్షవర్ధన్, పీల్డ్ అసిస్టెంట్ హరి తదితరులు పాల్గొన్నరు.

Read More Telangana | టెన్త్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసిన యువకులు

Views: 0