భక్తిశ్రద్ధలతో బొడ్రాయి ప్రధమ మహోత్సవం
తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచుల అధ్యక్షురాలు జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్
తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచుల అధ్యక్షురాలు, తాటికోల్ గ్రామ సర్పంచ్, జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ దంపతులు గ్రామ పంచాయతీ వెనుకలో గల ప్రధాన బోడ్రాయి వేద పండితులు, అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచరణాల మధ్య బొడ్రాయి పండుగ మొదటి వార్షిక పూజలను గ్రామస్తులతో పూజలు చేస్తూ ప్రారంభించారు.
జయభేరి, దేవరకొండ :
దేవరకొండ మండల తాటికోల్ గ్రామంలో మంగళవారం త్రయోదశి రోజు గ్రామ రక్షణకు, గ్రామ అష్టైశ్వర్యాలు సిద్ధికి బొడ్రాయి గౌరీ శీతలమాత, ముత్యాలమ్మ తల్లి,గ్రామదేవతల ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా సర్పంచుల అధ్యక్షురాలు, తాటికోల్ గ్రామ సర్పంచ్, జూలూరు ధనలక్ష్మి బాల నారాయణ గౌడ్ దంపతులు గ్రామ పంచాయతీ వెనుకలో గల ప్రధాన బోడ్రాయి వేద పండితులు, అర్చక బృందం ఆధ్వర్యంలో వేద మంత్రోచరణాల మధ్య బొడ్రాయి పండుగ మొదటి వార్షిక పూజలను గ్రామస్తులతో పూజలు చేస్తూ ప్రారంభించారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచి జూలూరు ధనలక్ష్మి బాలనారాయాణ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు సంరక్షించే పొలిమేర దేవతలను పూజించుకోవడం శుభమని, గ్రామ నిర్మాణంలో పవిత్రంగా భావించే ఆది దేవుడి ప్రతిరూపం నాభిశీల బొడ్రాయి అని అన్నారు.రేపు ఉదయం నుండి సాయంత్రం మహిళలు బోనాలతో ఊరేగింపుగా బొడ్రాయి వద్ద బోనాలు సమర్పించనున్నారు. తదనంతరం ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూలూరు అశోక్ గౌడ్ జూలూరు అంజయ్య జూలూరు శ్రీను, పల్స కొండయ్య,పప్పు వెంకటేష్ గ్రామ ప్రజలు,యువకులు,మహిళలు, సీనియర్ సిటిజెన్లు తదితరులు పాల్గొన్నారు.
Post Comment