మెడిసిన్ విద్యార్థి చదువుకి BLR చారిటబుల్ ట్రస్ట్ ఆర్ధిక సహాయం
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా అందజేత
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేసిఆర్ చేతుల మీదుగా ఎర్రవెళ్లి ఫాం హౌస్ లో ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా కేసిఆర్ మాట్లాడుతూ.. BLR చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెడిసిన్ సీటు సాధించిన వారికి 5 సంవత్సరాలకు అయ్యే ఫీజు మొత్తం చెల్లిస్తున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు అని కొనియాడారు.
జయభేరి, ఉప్పల్ :
ఉప్పల్ నియోజకవర్గం లో సీటు సాధించిన పేద విద్యార్థులకు మెడిసిన్ ఫీజు కడుతున్న ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డికి అభినందించిన మాజీ ముఖ్యమంత్రి BRS అధినేత కేసిఆర్. చర్లపల్లి డివిజన్ పరిధిలోని కుషాయిగూడ కి చెందిన అమర్నాథ్ గౌడ్ LB Nagar కామినేని హాస్పిటల్ లో మెడికల్ కాలేజీలో సీటు సాధించాడు.
Views: 0


