ఓయూ ఆర్ట్స్ వేదికగా AMSA ఆధ్వర్యంలో ఘనంగా భాగ్యరెడ్డివర్మ 136వ జయంతి వేడుకలు
భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున జన్మించిన ధృవతార సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు నిజాం స్టేట్ హైదరాబాద్ సంస్థానంలో ఆత్మగౌరవ పోరుకు తొలి పొద్దుగా నిలిచిన వ్యక్తి. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో నివాసం ఉంటున్న సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22న మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు జన్మించాడు.
జయభేరి, హైదరాబాద్ :
నామ సైదులు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. భాగ్యరెడ్డివర్మ దక్కన్ పీఠభూమిలో భాగ్యనగరం నడిబొడ్డున జన్మించిన ధృవతార సామాజిక ఉద్యమకారులకు తొలి గురువు నిజాం స్టేట్ హైదరాబాద్ సంస్థానంలో ఆత్మగౌరవ పోరుకు తొలి పొద్దుగా నిలిచిన వ్యక్తి. హైదరాబాద్ సుల్తాన్ బజార్ లో నివాసం ఉంటున్న సాధారణ దళిత మాల కుటుంబానికి చెందిన భాగ్యరెడ్డి వర్మ 1888 మే 22న మాదిరి వెంకటయ్య, రంగమాంబ దంపతులకు జన్మించాడు.
యుక్త వయసులో సుల్తాన్ బజార్లో ఆర్య సమాజంలో కొంతకాలం పని చేశాడు. ఆర్య సమాజం నిర్వహకులు కిషన్ రావు, భాగయ్య సేవలను గుర్తించి వర్మ అనే బిరుదుని ఇచ్చినారు. అదేవిదంగా కుల వ్యవస్థకు పెద్దపీట వేస్తున్న ఆ రోజుల్లో రెడ్డి కులానికి ఇచ్చే గౌరవాన్ని చూసి రెడ్డి అంటే పరిపాలదక్షుడిగా గౌరవం ఉంటుందని వారి కన్నా తమ జాతులు తక్కువ కాదని ఆయన పేరులో రెడ్డి చేర్చుకున్నాడు. ఈ విధంగా భాగ్యరెడ్డి వర్మ గా పిలవబడ్డాడు. హిందూ సమాజంలో అస్పృశ్యత వ్యక్తుల మధ్య వ్యత్యాసం గమనించిన భాగ్యరెడ్డి వర్మ అనగారిన వర్గాలకు దళితుల పట్ల చైతన్యం తీసుకురావడానికి దళిత బాలికలకోసం 26పాఠశాలలో నెలకొల్పాడు.
బస్తీల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఒకవైపు విద్యుత్ శాఖలో ఉద్యోగం చేస్తూనే సాంఘిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. జగన్ మిత్రమండలి, ఆది హిందూ సోషల్ లీగ్ ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు NM శ్రీకాంత్ యాదవ్, ఉదయ్,గోపి బసవరాజు, శ్రీను, దామోదర్, తదితరులు పాల్గొన్నారు.


