ట్రైన్ లో లైంగిక దాడికి యత్నం - మద్యం మత్తులో
- ట్రైన్ నుంచి జారి క్రిందపడిన మహిళ
- లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి కూడా ట్రైన్ నుండి క్రింద పడిన వైనం
- విశాఖ ఎక్స్ ప్రెస్ రైల్లో మద్యం మత్తులో ఓ యువకుడు ప్రయాణికు రాలిపై లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన లో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.
సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్ప్రెస్ మంగళవారం రాత్రి 7గంటలకు మిర్యాలగూడ స్టేషన్కు చేరుకుంది. రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే రైలు వేగం తగ్గింది. అదే సమయంలో ఎస్-2 బోగీలో ప్రయాణిస్తున్న ఓ మహిళ వాష్రూమ్ నుంచి తన సీటు వద్దకు వెళ్తుండగా డోర్ వద్ద మద్యం మత్తులో ఉన్న ఒడిశాకు చెందిన బిశ్వాస్.. ఆమె నడుము పట్టుకుని కిందకు లాగాడు. ఈ క్రమంలో ప్రయాణికురాలు రైలు నుంచి కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత బిశ్వాస్ కూడా రైలు నుంచి కిందపడ్డాడు.
Read More Congress I లెక్కలు తేల్చాల్సిందే...
Views: 0


