ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

బిజెపి మహిళా మోర్చా ఆద్వర్యంలో కోటి ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా

ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

జయభేరి, హైదరాబాద్ జూన్ 18 :
రాష్ట్రము లోని ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆద్వర్యం లో వందలాది మంది మహిళలు కోటి లోని ఆరోగ్య విభాగం వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఒక సందర్బంలో మహిళలు ఆరోగ్య విభాగంలోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్తితి  న్నేలకోంది. ఈసందర్బంగా డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ.. ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వారికి ప్రతి నెల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేసారు. అనంతరం జాయింట్ డైరక్టర్ పద్మజను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా జాయింట్ డైరక్టర్ పద్మజ మాట్లాదుతూ.. ఆశ వర్కర్లకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు శిల్పారెడ్డి తెలిపారు.

Read More మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు