విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

విద్యార్థులకు & తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

జయభేరి, మేడిపల్లి : రాచకొండ పోలీస్ కమిషనరేట్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుడమి హై స్కూల్ బోడుప్పల్ లో మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్, షీ టీమ్స్ సంయుక్తంగా విద్యార్థినీ విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

IMG-20241211-WA2261

Read More యువత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చాక కాకుండా ముందు నుండే సిద్ధంగా ఉండాలి...

ఈ కార్యక్రమంలో  ముఖ్య అతిథిగా హాజరైన ఇన్స్పెక్టర్ మేడిపల్లి R. గోవిందరెడ్డి మాట్లాడుతూ... విద్యార్థినీ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ఎప్పటికప్పుడు టెక్నాలజీని వినియోగించుకుని సాంకేతికతను అందుపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, చెడు వ్యసనాలకు బానిస కావద్దని, ఉపాధ్యాయుల పట్ల, పెద్దల పట్ల  గౌరవంగా ఉండాలని, అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని... సైబర్ నేరాలకు ముఖ్య కారణం ఒకటి అత్యాశ రెండు అమాయకత్వం ఈ రెండు కారణాలవల్ల సైబర్ నేరాలు జరుగుతాయని ఏదైనా సైబర్ నేరాలకు గురి అయితే వెంటనే Dial-1930 కు కాల్ చేయాలని... ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచనలు చేస్తూ సమాజంలో మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల జరిగే నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎట్టి పరిస్థితులతో పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని, తల్లిదండ్రుల ప్రవర్తన ఆధారంగానే విద్యార్థుల ప్రవర్తన సమాజంలో ఉంటుందని, ఇన్స్పెక్టర్ గారు సూచించారు.

Read More ములుగు జిల్లా చల్పాక ఎన్ కౌంటర్ పై హైకోర్టులో నేడు విచారణ!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాఫిక్ ఘట్కేసర్ సబ్ ఇన్స్పెక్టర్ మల్లయ్య మాట్లాడుతూ... ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, విద్యార్థినీ విద్యార్థులకు మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు నడపకూడదని దేవుడు అన్ని అవయవాలు పరిపూర్ణంగా ఇచ్చాడని చిన్న నిర్లక్ష్యం వల్ల చాలామంది విద్యార్థులు రోడ్డు ప్రమాదం బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మరి ఎంతోమంది అంగవైకల్యం చెంది అవయవాలు కోల్పోయి సమాజంలో నరకం అనుభవిస్తున్నారని హెచ్చరించారు.

Read More రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు  కలెక్టర్

IMG-20241211-WA2263

Read More ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

అదేవిధంగా ఈ కార్యక్రమంలో రాచకుండా షీ టీమ్స్ ఏఎస్ఐ నళిని మాట్లాడుతూ... చిన్నపిల్లలు, మహిళల కోసం షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని ఏదైనా సమాచారం ఉంటే ఎవరైనా వేధించినట్లయితే వెంటనే షీ టీమ్స్ వారికి సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వేధించిన వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సూచించారు.

Read More ఎంజెపి లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

IMG-20241211-WA2260

Read More మహిళ ఆశా వర్కర్స్ డే 

ఈ కార్యక్రమంలో రాచకొండ షీ టీం మొబైల్ ఎల్ఈడి ద్వారా ఏర్పాటుచేసిన వీడియో ప్రదర్శన పిల్లలకు అర్థమయ్యే విధంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పుడమి స్కూల్ చైర్మన్ సంజీవరావు, స్కూల్ ప్రిన్సిపల్ పద్మిని మేడం పాల్గొన్నారు. దాదాపు విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు దాదాపుగా 400 మంది పాల్గొన్నారు.

Read More ఈనెల 25న జరిగే రవీంద్ర భారతిలో బీసీల సమరభేరిని విజయవంతం చేయండి

IMG-20241211-WA2281

Read More భగవాన్ సత్యసాయి పుట్టినరోజు మహిళా వృద్ధుల ఆశ్రమ నిర్మాణమునకు రు. 50,116 విరాళం