Amith Shah : రజాకార్ల నుంచి విముక్తి
మాధవీలతకు మద్దతుగా హైదరాబాద్ లో అమిత్ షా రోడ్ షో
జయభేరి, హైదరాబాద్:
పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంపై బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాతబస్తీలో పాతుకుపోయిన ఎంఐఎంకు సవాల్‌గా బీజేపీ కూడా అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికల ప్రచారం వరకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం రాష్ట్ర రాజధానిలో రోడ్ షో నిర్వహించారు. లాల్ దర్వాజ మహంకాళి ఆలయం నుంచి సాలిబండ సుధా టాకీస్ వరకు అమిత్ షా రోడ్ షో కొనసాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు అడుగడుగునా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. దీంతో రాజధాని రహదారులన్నీ కాషాయమయంగా మారాయి.
Views: 0


