మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్లాట్ల భాదితుల ఆందోళన

మేడ్చల్ పట్టణంలోని గౌడవెళ్లి రోడ్డులో సర్వే నెంబర్ 1000, 1001, 1015లలో గల 6 ఎకరాల విస్తీర్ణంలో గత ఆరేళ్ల క్రితం వెంచర్ చేసి 118 ప్లాట్లు చేయగా తాము అందులో కోనుగోలు చేశామని అప్పట్లో వెంచర్ నిర్వాహకులు అయిన ఏర్పుల హరిప్రసాద్ కుటుంబం తమ స్థలానికి దారి చూపి ఓ కంపెనీతో ఎంఓయూ చేసుకుని ప్లాట్లుగా మార్చడంతో తాము రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లు కోనుగోలు చేశామని ప్లాట్ల కోనుగోలు సమయంలో దారి చూపిన సదరు డెవలపర్స్, భూ యజమానులు ప్రస్తుతం ఆ స్థలానికి దారి లేదంటూ ప్రహారీ గోడను అడ్డుగా పెట్టారని తెలిపారు.

మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద ప్లాట్ల భాదితుల ఆందోళన

జయభేరి, మేడ్చల్ :
రూ. లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన స్థలానికి ప్రస్తుతం దారి లేకుండా చేసి ఆక్రమంగా ప్రహారీ గోడ ఏర్పాటు చేసి తమను ఇబ్బందులకు గురిచేస్తున్న స్థల యాజమానిపై చర్యలు తీసుకోసి తమకు దారి చూపాలంటూ పలువురు ప్లాట్లు కొనుగోలుదారులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం ఆందోళన చేశారు.

వివరాల్లోకి వెళితే మేడ్చల్ పట్టణంలోని గౌడవెళ్లి రోడ్డులో సర్వే నెంబర్ 1000, 1001, 1015లలో గల 6 ఎకరాల విస్తీర్ణంలో గత ఆరేళ్ల క్రితం వెంచర్ చేసి 118 ప్లాట్లు చేయగా తాము అందులో కోనుగోలు చేశామని అప్పట్లో వెంచర్ నిర్వాహకులు అయిన ఏర్పుల హరిప్రసాద్ కుటుంబం తమ స్థలానికి దారి చూపి ఓ కంపెనీతో ఎంఓయూ చేసుకుని ప్లాట్లుగా మార్చడంతో తాము రూ. లక్షలు వెచ్చించి ప్లాట్లు కోనుగోలు చేశామని ప్లాట్ల కోనుగోలు సమయంలో దారి చూపిన సదరు డెవలపర్స్, భూ యజమానులు ప్రస్తుతం ఆ స్థలానికి దారి లేదంటూ ప్రహారీ గోడను అడ్డుగా పెట్టారని తెలిపారు. హరిగోపాల్ అనే వ్యక్తి గతంలో ఓ సంస్థ ద్వారా తమకు ప్లాట్లు విక్రయించి ఇప్పుడు అదే స్థలానికి దారి లేదంటూ అడ్డు గోడ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయంపై బాధితులమైన 118 మంది మేడ్చల్ పోలీసులను గతంలో ఆశ్రయించి ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారని తెలిపారు.

Read More Telangan I తలరాత మార్చే విద్య తల వంపులు పాలవుతోందా!?

సదరు హరిప్రసాద్ ఒక్కో ప్లాట్ యజమాని రూ.2 లక్షలు ఇవ్వాలని తమను డిమాండ్ చేస్తున్నారని, కాదని చెబితే ఆ స్థలంలోని తమను వెళ్లనివ్వడం లేదని, దీంతో తమకు ప్రాణహానీ కలుగుతుందని భాదితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించి పోలీసులను ఆశ్రయించారు. అధిక డబ్బుల ఆశతోనే తమను స్థలంలోని వెళ్లనివ్వకుండా అడుకుంటున్న హరిప్రసాద్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Read More Telangana I పరీక్షకే..పరీక్ష...

Views: 1

Related Posts