పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా

రాజకీయంలో వీడ్కోలు అనేది పదవికే గాని సేవకు కాదు :- కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ..!

పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా

జయభేరి, మేడ్చల్ : పదవి ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా నిలబడతా అని మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కురుమ మహేష్ అన్నారు. మంగళవారం 23వ వార్డు లో మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ పదవి విరమణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా పూలమాలు వేసి, శాలువాతో సత్కరించి కౌడే మహేష్ కురుమ కు పదవీ విరమణ వీడ్కోలు సన్మానసభ శుభాకాంక్షలు తెలియజేసారు. మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ మాట్లాడుతూ రాజకీయంలో వీడ్కోలు అనేది పదవికే గాని సేవకు కాదన్నారు. ప్రజల కష్టసుఖాల్లో తోడుండే నాయకులకు ప్రజల గుండెల్లో ఎప్పుడూ పదవి ఉన్నట్టే అన్నారు.

Read More BJP_Bandi Vs Ponnam I విజయ సంకల్ప యాత్ర ..? అసలు ఉద్దేశం ఏంటి!?

సేవా దృక్పధం ఉన్న నాయకులకు నిరంతరం ప్రజల అభిమానం ఉన్న నాయకులకు విరమణ అనేది ఉండదని, మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు వార్డులో బాధ్యతయుతంగా పని చేసి అభివృద్ధికి సహకరించాలన్నారు.

Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?

ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేముల శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు లవంగు రాకేష్ వంజరి, మేడ్చల్ మున్సిపాలిటీ ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు గుండ శ్రీధర్ కురుమ, ఆర్ఫీలు అనిత, బాలమణి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎస్ సి సెల్ ఉపాధ్యక్షులు పెగుడ శ్యామ్ రావు, మేడ్చల్ మండల కురుమ సంఘం అధ్యక్షులు గౌర్ల ఎర్ర భీరప్ప కురుమ, మేడ్చల్ పట్టణ మాజీ వార్డు మెంబర్ కౌడే నాగేందర్ కురుమ, మేడ్చల్ పట్టణ కురుమ సంఘం అధ్యక్షులు గౌర్ల మధు కురుమ, ఉపాధ్యక్షులు ఒగ్గు సురేష్ కురుమ, ప్రధాన కార్యదర్శి కౌడే శ్రీశైలం కురుమ, జాయింట్ సెక్రటరీ గుండ గణేష్ కురుమ, మహమ్మద్ సాబేర్, సయ్యద్ అఖిల్, షేక్ ఇబ్రహీం, మేడ్చల్ పట్టణ కురుమ సంఘం సభ్యులు కౌడే భిక్షపతి కురుమ, మైల శంకర్ కురుమ,కౌడే నరేందర్ కురుమ, ఒగ్గు వినోద్ కురుమ, గౌర్ల మల్లేష్ కురుమ, మైల జీతయ్య కురుమ,శ్రీరంగవరం నర్సింహ్మ కురుమ, కౌడే రాజు కురుమ, గౌర్ల సత్తయ్య కురుమ, అక్రం, రంజు, ఆమీర్, షకీల్, బబ్లూ మేడ్చల్ పట్టణ పుర ప్రముఖులు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!? 

Views: 0