పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆధార్ పార్టీ అధ్యక్షులు నామినేషన్ దాఖలు
జయభేరి, హైదరాబాద్ :
ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్.ఎల్. సి అభ్యర్థిగా ఆదార్ పార్టీ (చపాతీ రోలర్) అధ్యక్షులు డా. ఈడా శేషగిరి రావు గౌడ్ నిన్న నామినేషన్ దాఖలు చేశారు. తను ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తుమ్మలపల్లి గ్రామంలో జన్మించిన వీరు రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబంతో పాటు వారి తండ్రి స్వాతంత్య్ర సమరయోధులుగా, తల్లి సర్పంచ్, జెట్పిటిసి సభ్యురాలిగా పనిచేసారు. ఉన్నత విద్యావంతుడుగా ఎమ్ ఎస్సి జెనెటిక్స్, ఎల్.ఎల్.ఎమ్ పూర్తి చేసి పార్టీ ఫిరాయింపుల చట్టం మీద పిహెచ్ డి పట్టా పొందారు. స్వాతంత్య్ర భావాలు కలిగిన శేషగిరి రావు ప్రతినిత్యం సమాజానికి ఉపయోగపడే విధంగా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఎంతో మంది పేదలకు సేవ చేయడంతో పాటు నిరుపేద విద్యార్ధులకు ఆర్థిక సహాయం ప్రకటించేవారు. 1999 లో ఖమ్మం పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసారు. 2022 లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో సైతం పోటీ చేసారు. గతంలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయవాదుల సంఘం సెక్రెటరీగా గవర్నమెంటు తరపున హైకోర్టు న్యాయవాదిగా పని చేసారు. గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, గోప సంఘంలో రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసారు. రాష్ట్ర గౌడ సంఘాల సమన్వయ సంఘం గౌరవ చైర్మన్ గౌడల ఐక్యతే ధ్యేయంగా జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో ఉన్న గౌడ ప్రముఖులందరినీ ఏకం చేసి గౌడ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు న్యాయవాదిగా పని చేస్తూ బిసి, ఎస్సి, ఎస్టి మైనార్టీ ప్రజల ఐక్యం కోసం జాతీయ స్థాయిలో ఆదార్ పార్టీని స్థాపించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 43 స్థానాలలో ఆదార్ పార్టీ తరపున అభ్యర్థులను నిలిపారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకోసం అనేక పోరాటాలు నిర్వహిస్తున్నారు.


