స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఒక అనాధ తల్లిని వృద్ధాశ్రమానికి పంపించినారు

  • నవ మాసాలు మోసి పెంచిన కన్నతల్లులని ఇలా వదిలేయడం అన్నది మాతృ ద్రోహం అని, చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా, కడుపులో దాచుకొని విసుకు చెందకుండా పెంచి పెద్ద చేసిన వారిని రెక్కలు వచ్చిన తర్వాత మనమెందుకు వదిలేయాలి.

స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఒక అనాధ తల్లిని వృద్ధాశ్రమానికి పంపించినారు

జయభేరి, దేవరకొండ : 
హనుమాన్ నగర్ లో ఒక అరుగు మీద కూర్చొని బాధపడుతున్న అనాధ తల్లిని గమనించిన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ వారు ఆమె వద్దకు వెళ్లి వివరాలడగా ఏమి చెప్పలేని పరిస్థితిలో ఉన్న ఆమెను వెంటనే ఆటోలో ఎక్కించుకొని మహాలక్ష్మి వృద్ధాశ్రమానికి వెళ్లి అధ్యక్షురాలు సంధ్యా రెడ్డికి అప్పగించడం జరిగినది. ఈ సందర్భంగా అధ్యక్షులు NVT మాట్లాడుతూ... నవ మాసాలు మోసి పెంచిన కన్నతల్లులని ఇలా వదిలేయడం అన్నది మాతృ ద్రోహం అని, చిన్నప్పుడు మనం ఎంత అల్లరి చేసినా, ఎన్ని తప్పులు చేసినా, కడుపులో దాచుకొని విసుకు చెందకుండా పెంచి పెద్ద చేసిన వారిని రెక్కలు వచ్చిన తర్వాత మనమెందుకు వదిలేయాలి. మన కన్న తల్లిదండ్రులు 60 ఏళ్లు దాటిన తర్వాత చిన్నపిల్లల గా ప్రవర్తిస్తారు అలాంటప్పుడు మనం ఎందుకు విసుక్కోవాలి మనకెందుకు లేదా ఓపిక అనేది ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను. ఈ తల్లికి సంబంధించిన వారు వచ్చి తీసుకెళ్లవలసిందిగా కోరుచున్నాము అని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో మహాలక్ష్మి మహిళ వృద్ధాశ్రమం అధ్యక్షురాలు సంధ్యారెడ్డి, SBI శ్రీనయ్య, కరాటే మాస్టర్ శ్రీను, ఆకాష్, డాన్స్ మాస్టర్ జగన్, చక్రపాణి, నరసింహ, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

31a6d625-30b1-4bee-be9e-e9f5f2457a52

Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం..