దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని విన్నపం

  • ఎన్ సి ఎస్ సి ఛైర్మన్ కిషోర్ మాక్వానా ను కలిసిన తెలంగాణ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ రామ్మోహన్

దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించాలని విన్నపం

జయభేరి, ఏప్రిల్ 26 :

జాతీయ కమిషన్ ఆఫ్ షెడ్యూల్డ్ కులాల (ఎన్.సి.ఎస్.సి) చైర్మన్ కిషోర్ మక్వానాను తెలంగాణ దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు బిఎన్. రాంమోహన్ మర్యాద పూర్వకంగా కలిశారు. శామీర్‌పేట్ మండలం తూంకుంట మున్సిపాలిటీ దేవరయాంజాల్ గ్రామానికి చెందిన బిఎన్.రామ్ మోహన్  న్యూఢిల్లీలోని ఎన్.సి.ఎస్.సి కార్యాలయంలో చైర్మన్ ను కలిశారు. అనంతరం దళితుల సమస్యల పట్ల చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో నేటికీ దళితులపై వివక్ష కొనసాగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. అదేవిధంగా పౌరహక్కుల దినోత్సవాన్ని అధికారికంగా జరిపించాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16(4) ప్రకారం సమాన అవకాశాలను అందుబాటులో ఉంచడానికి, సామాజిక, ఆర్థిక అసమానతలను తొలగించాలని ఉద్దేశించబడ్డాయని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం దళితులు, బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటు పడాలని కోరారు. అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన ఎన్.సి.ఎస్.సి చైర్మన్ కిషోర్ మక్వానా వీలైనంత త్వరలో ఈ విషయంపై రాష్ట్ర డిజిపికి లేఖ రాసి పంపిస్తామని హామి ఇచ్చారు.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు