మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

మేడ్చల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసిన టీయూడబ్ల్యూజే నేతలు

మల్లారెడ్డి వార్తలు బైకట్ చేద్దాం... టీయూడబ్ల్యూజే (ఐజెయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీద బాలరాజు

మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి

జయభేరి, మేడ్చల్ : జర్నలిస్టులపై దాడులకు తెగబడిన మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఐజెయు) మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు  గడ్డమీది బాలరాజు తెలిపారు.

గత శనివారం మల్లారెడ్డి ఆసుపత్రిలో మృతుల బంధువులు చేపట్టిన ఆందోళన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన  మీడియా ప్రతినిధులపై ఆస్పత్రి వర్గాలు బౌన్సర్లతో దాడులు చేయించారు. ఈ మేరకు సోమవారం పెట్ బషీరాబాద్ లోని  మేడ్చల్ జోన్ డిసిపి కోటిరెడ్డి ని కలిసి యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా గడ్డమీది బాలరాజు మాట్లాడుతూ వైద్యులు ఉండాల్సిన అస్పత్రి లో బౌన్సర్లకు ఏం పని అని ప్రశ్నించారు.

Read More ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 

IMG-20241111-WA1635

Read More ఘనంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్ జన్మదిన వేడుకలు

నిబంధనలకు విరుద్ధంగా ఆస్పత్రి ఆవరణలో బౌన్సర్లను నియమించి రోగులను, బంధువులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తన పలుకుబడిన ఉపయోగించి విద్య, వైద్య రంగంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. మీడియా జోలికొస్తే  మల్లారెడ్డిని వదిలిపెట్టే సమస్య లేదని హెచ్చరించారు. తాను ఏం చేసినా చెల్లుతుందని భావిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను ఏకం చేసి ఆందోళన చేపడతామన్నారు.  

Read More మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి విజయం పట్ల హర్షం  

IMG-20241111-WA1633

Read More సీసీ కెమెరాల ఏర్పాటుకు హెచ్ బి ఎల్  పరిశ్రమ సహకారం

మల్లారెడ్డికి సంబంధించిన రాజకీయ, విద్య, ఆస్పత్రి లకు సంబంధించిన వార్తలను బైకట్  చేయాలని మేడ్చల్ జిల్లా జర్నలిస్టులకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా డిసిపి కోటిరెడ్డి  మాట్లాడుతూ సమగ్ర విచారణ జరిపించి యాజమాన్యంపై కేసు నమోదు చేస్తామని  హామీ ఇచ్చారు. జిల్లా వైద్య అధికారులను  ఆస్పత్రిలో బౌన్సర్ల విషయమై  వివరణ తీసుకొని  చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావతం కాకుండా చూస్తామన్నారు.

Read More పైడిపెల్లిలో  చెక్ డ్యాం నిర్మాణానికి స్థల పరిశీలన

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దయాకర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, శివాజీ, జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, కార్యదర్శి సాయిబాబా, కోశాధికారి శేషారెడ్డి, నాయకులు రాజేందర్, రాజు, ప్రవీణ్, సంతోష్, మాధవ రెడ్డి, బాధిత జర్నలిస్ట్ లు తదితరులు పాల్గొన్నారు.

Read More మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సాయి గౌడ్

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి