మాధవీలతపై కేసు నమోదు
మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు.
జయభేరి, హైదరాబాద్, మే 13 :
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాధవి లతపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్‌లు 171 సి, 186, 505 (1) (సి) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద నమోదైంది. మాధవి లత పోలింగ్ బూత్‌కు వెళ్లిన సందర్భంగా ముస్లిం మహిళల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ అభ్యర్థి మాధవి లత పోలింగ్ బూత్‌లో ఉన్న ముస్లిం మహిళలను బురఖా తొలగించాలని కోరడం, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. అంతేకాదు తమ గుర్తింపు కార్డలను కూడా బయటపెట్టాలని ఆమె కోరుతోంది. ఈ విషయంపై ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు. దీంతో మాధవి లతపై కేసు నమోదు చేయాలని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ పోలీసులను ఆదేశించారు. దీంతో మలక్ పేట్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.
Post Comment