దేవరకొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు 20 దుప్పట్లు పంపిణీ
లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ వనం బిక్షమయ్య జన్మదినాన్ని ఘనంగా జరిపిన లయన్స్ క్లబ్
సామాజిక సేవలో లయన్స్ సభ్యులు
బిక్షమయ్యకు మొక్కను అందించి స్వీట్లు తినిపించి శాలువతో ఘనంగా సత్కారం
బిక్షమయ్యకు శుభాకాంక్షలు తెలియజేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ
దేవరకొండ : లయన్స్ సభ్యుల ప్రతి జన్మదినాలు పేదలదేవరకొండ పాలిట వరాలుగా మారాలని దేవరకొండ లయన్స్ క్లబ్ అధ్యక్షులు వస్కుల సత్యనారాయణ అన్నారు. దేవరకొండ లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ వనం బిక్షమయ్య 67వ జన్మదిన పురస్కరించుకొని సోమవారం దేవరకొండ లోని బస్టాండ్ వద్ద పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ వస్కుల సత్యనారాయణ మాట్లాడుతూ జన్మదిన వేడుకలు నాలుగు గోడల మధ్యన కాకుండా నలుగురిలో జరుపుకొని పేదవారికి సహాయం అందించడం అభినందనీయమని తెలిపారు.
నేడు లయన్స్ క్లబ్ లో పని చేయడానికి ఎంతోమంది ముందుకు వస్తున్నారని వారందరికీ స్వాగతం పలుకుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.డబ్బుతో లయన్స్ క్లబ్ లో పనిచేసే ప్రతి ఒక్కరూ దానకర్ణులని దానం కన్నా మిన్న మరొకటి లేదని సమాజానికి మనం ఎంత ఇస్తే తిరిగి మనకు మరింత అందిస్తుందని అది గుర్తెరిగి సంపాదనలో రెండు శాతం సమాజానికి తెలియ చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సముద్రాల ప్రభాకర్, చిలుకూరి నిరంజన్ , దాచేపల్లి రాధాకృష్ణ, కొండూరు ఆంజనేయులు, గాజుల ఉషారాణి, డాక్టర్ పి జె సామ్సన్, గుద్దేటి జంగయ్య, చేరుపల్లి జయలక్ష్మి యల్లయ్య, శివకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post Comment