సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్

మంత్రి పొన్నం ప్రభాకర్ కు ధన్యవాదాలు

సైదాపూర్ మండలం మార్కెట్ కమిటీ చైర్మన్గా దొంత సుధాకర్

జయభేరి, సైదాపూర్ : కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంతు సుధాకర్ నియామకమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన నియమాకానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కు మండల ప్రజా ప్రతినిధులకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు యూత్ కాంగ్రెస్ నాయకులకు మండల ప్రజలకు కృతజ్ఞతలు. నాతోపాటు ఎన్నికైన కమిటీ సభ్యులు నాదెండ్ల రాజకుమార్ ఉపాధ్యక్షులు, కమిటీ సభ్యులు నల్లి సదానందం, మొహమ్మద్ చోటా మియా, పల్లె గోపాల్ రెడ్డి, బొల్లం సోమయ్య, పెద్ది తిరుపతి, బైరి రాజు, చల్లూరి రాజయ్య, మద్దూరి రజిత, తాళ్లపల్లి వెంకటేశం, ఉడిగే రాజశేఖర్  శుభాకాంక్షలు తెలియజేశారు.

Read More Telangan Sand I తెలంగాణ చరిత్ర, జాతి, ఎన్నటికీ క్షమించదు... ప్రకృతి సంపదను కొల్లగొట్టిన గత ప్రభుత్వపు పాలన...

Views: 1