అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించిన మాజీ సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి

అలియాబాద్ లో ఘనంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు

జయభేరి, సెప్టెంబర్ 7:- మేడ్చల్ జిల్లా శామీర్ పేట మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని అలియాబాద్ గ్రామంలో వినాయక చవితి పండగ ఘనంగా జరిగింది.

ఇక స్థానికంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద గ్రామ మాజి సర్పంచ్ కంఠం కృష్ణారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విఘ్నాలు తొలగించే గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

Read More వాసవి క్లబ్, వాసవి వనిత క్లబ్  ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

ప్రతీ హిందువు ఏ కార్యక్రమం మొదలు పెట్టాలనుకున్న మొదట ఆది దేవుడు వినాయకుడినే పూజిస్తారని తెలిపారు. ప్రతీ ఒక్కరు వినాయక నవరాత్రి ఉత్సవాలను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.

Read More  ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పలి