వర్గల్ క్షేత్రాన్ని... తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి గా తీర్చిదిద్దడమే ఏకైక లక్ష్యం
- ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న దాతలు
- శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతి
జయభేరి. గజ్వేల్, అక్టోబర్ 06 :
దాతలు, భక్తుల సంపూర్ణ సహకారంతోనే ఆలయ అభివృద్ధి సాధ్యపడిoదని వర్గల్ శ్రీ విద్యాధరి క్షేత్ర వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ, యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి పేర్కొన్నారు. ఆదివారం తున్కిమక్త తాజా మాజీ సర్పంచ్ ఎల్కoటి సంతోష వెంకటేష్ రూ లక్షా 11 వేలు ఆలయ అభివృద్ధి నిమిత్తం అందజేశారు.
Read More డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు
ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత కలిగిన శంభూగిరులపై ఆలయ సముదాయ నిర్మాణం తమ పూర్వజన్మ సుకృతమని అన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ప్రతినిత్యం పండగ వాతావరణం నెలకొంటుండగా, అమ్మవారి క్షేత్ర వైభవం నాలుగు దిశలా వ్యాపించి భక్తుల కొంగుబంగారంగా ఆలయ సముదాయం విలసిల్లుతోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో వర్గల్ క్షేత్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఏకైక లక్ష్యమని, గత మూడు దశాబ్దాలుగా వివిధ రకాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీ రుణపడి ఉంటుందని వివరించారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment