లష్కర్ బోనం ఎత్తింది...
- గల్లీ గల్లీలో కన్నుల పండుగగా బోనాల జాతర..
- ప్రతి ఇంటి నుండి ఒక బోనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు..
- పార్శి గుట్ట పరిసర ప్రాంతాల్లో అట్టహాసంగా అమ్మవారికి బోనం సమర్పించారు భక్తులు.
జయభేరి, పార్శీ గుట్ట:
ఆషాడ మాసం బోనాలు మొదలైన దగ్గర నుంచి ప్రతి ఆదివారం ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా బోనాల జాతర తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను కళ్ళకు కట్టినట్టుగా మరొకమారు చూపించింది.
Read More ముఖ్యమంత్రి సహాయ నిది నిరుపేదలకు వరం..
ఈ సందర్భంగా పార్సిగుట్ట సంజీవపురం కాలనీలో పలువురు మహిళలు అమ్మవారికి బోనమెత్తి తమ సంతోషాన్ని జయభేరి న్యూస్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తిన మహిళ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి ఏడూ అమ్మవారికి బోనం ఎత్తుతం. మాకు మంచి జరుగుతుంది. అమ్మవారి ఆశీర్వాదాలు కలుగుతాయని సంతోషంగా మీడియాతో మాట్లాడారు. అలాగే రత్నకుమారి పూజిత మరో ఇద్దరు మహిళలు కూడా బోనం ఎత్తి అమ్మవారికి బోనాన్ని సమర్పించడం ద్వారా మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాం. అంటూ మీడియాతో తమ సంతోషాన్ని పంచుకున్నారు. మొత్తానికి లష్కర్ బోనం పెట్టింది. కన్నుల పండగ ప్రతి గల్లీ గల్లీలో బోనాల జాతర కన్నుల పండుగ సాగింది.
Latest News
నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
04 Nov 2024 09:35:49
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Post Comment