Modi : ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్’
- మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉంది.. అందుకు ఉదాహరణ సీఏఏ చట్టమే
- విపక్ష కూటమి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తోంది
- 70ఏళ్లుగా హిందువులు, ముస్లింలు అంటూ విభజించి రాజకీయం చేశారు
- విపక్షాలపై ఫైర్ అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ
జయభేరి, అజాంఘర్, మే 16 :
పేదల అభివృద్ధి కోసం రాత్రి పగలు కష్టపడుతున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మీ బాధలను ఒక్కొకటిగా తొలగిస్తున్నామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తర ప్రదేశ్ లో ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. అజాంఘర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘ఎక్కడికెళ్లినా ఒకటే మాట వినిపిస్తోంది.. అదే ఫిర్ ఏక్ బార్.. 400 పార్’ అని చెప్పారు. దేశ ప్రజలంతా మోడీనే మళ్లీ ప్రధాని అంటున్నారని ఆయన చెప్పారు. మోడీ గ్యారెంటీపై ప్రజలకు నమ్మకం ఉందని.. అందుకు, సీఏఏ చట్టమే ఉదాహరణ అని ప్రధాని చెప్పారు. సీఏఏ కింద భారత్ పౌరసత్వం ఇవ్వడం ప్రారంభమైందన్నారు.
Views: 0


