Shanthi Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు..

శాంతిస్వరూప్ మృతి పట్ల రేవంత్ రెడ్డి, నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు...

Shanthi Swaroop : తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ ఇక లేరు..

న్యూస్ రీడర్‌గా శాంతిస్వరూప్ తనదైన ముద్ర వేశారని రేవంత్ రెడ్డి అన్నారు.. ఆయన సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని వ్యాఖ్యానించారు.. ప్రజలకు శాంతిస్వరూప్ ఎంత దగ్గరగా ఉంటుందో వార్తలు కూడా అంతే దగ్గరగా ఉంటాయని లోకేష్ అన్నారు

తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఖ్యాతి గడించిన శాంతిస్వరూప్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల రాజకీయ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తొలి తరం న్యూస్ రీడర్ గా తెలుగు వారందరికీ సుపరిచితుడైన శాంతిస్వరూప్ మృతి బాధాకరమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 1983 నుంచి శాంతిస్వరూప్ న్యూస్ రీడర్‌గా తనదైన ముద్ర వేశారు. చిరకాలంగా దూరదర్శన్ ద్వారా ఆయన చేస్తున్న సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చిరస్మరణీయమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. శాంతిస్వరూప్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.

Read More Shashi Tharoor I విప‌క్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే CAA రద్దు చేయబడుతుంది

దూరదర్శన్ కంటే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శాంతిస్వరూప్ మరణం వార్త.. న్యూస్ అంటే శాంతిస్వరూప్ అని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. శాంతిస్వరూప్‌కు అశ్రు నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.

Read More Indian law : ఆందోళన సరే... చట్టాలు ఎప్పుడు

Views: 0

Related Posts