మెడిసిటి ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన
జయభేరి, డిసెంబర్ 4:
అలియాబాద్ లోని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద మెడిసిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బీపీ, షుగర్, పరీక్షలతో పాటు కంటి, చెవి, ముక్కు, గొంతు, వరిబీజము, గడ్డలు, కణతులు, థైరాయిడ్, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలు వంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి అనంతరం ఉచితంగా మందులను పంపిణీ చేశారు.
సుమారుగా 125 మందికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్ అవసరమైన 40 మందిని మెడిసిటీ ఆస్పత్రికి రిఫర్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ కమటం కృష్ణారెడ్డి, వైద్యులు వినయ్, షాకిర్, సుచరిత, నిఖిత, నవ్య, మార్కెటింగ్ ఇంచార్జీ కుమారస్వామి, సత్యనారాయణ, శేఖర్ బాబు, రాకేష్, సాయి సుకేశ్, మానస తదితరులు పాల్గొన్నారు.
Latest News
ఇన్ని సంవత్సరాలకు గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించుకోవడం సంతోషంగా ఉంది...
21 Jan 2025 09:39:00
ఒక చెట్టుకు పూసిన పువ్వులం కాదు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలము కాదు. అయినా ఆత్మీయనురాగాలను పంచుకున్న మా బంధం స్నేహబంధం.
Post Comment