Diabetes : బెరియాట్రిక్ సర్జరీతో హై-బిఎమ్ఐ పేషెంట్స్లో మధుమేహం దూరం

కేర్ ఆసుపత్రి వైద్యుల ఘనత

  • ఈ వ్యాధి వచ్చినవారు మందులు తీసుకుంటూ, జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఒరిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హై బి.ఎం.ఐ. తో బాధపడుతూ డయాబెటిస్ నుంచి పూర్తిగా బయటపడ్డారు.

Diabetes : బెరియాట్రిక్ సర్జరీతో హై-బిఎమ్ఐ పేషెంట్స్లో మధుమేహం దూరం

జయభేరి, హైదరాబాద్, ఏప్రిల్ 26: 
జీవనశైలి కారణంగా చాలామంది ప్రజలు మధుమేహం మారిన పడుతున్నారు. ఇది ఒకసారి వచ్చిందంటే దీని నుంచి బయటపడటం దాదాపు అసాధ్యం. ఈ వ్యాధి వచ్చినవారు మందులు తీసుకుంటూ, జీవనశైలి మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఒరిస్సా రాష్టానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హై బి.ఎం.ఐ. తో బాధపడుతూ డయాబెటిస్ నుంచి పూర్తిగా బయటపడ్డారు. దశాబ్ద కాలంగా పోరాడుతున్న వారు కేర్ ఆసుపత్రి బంజారాహిల్స్లో ట్రాన్స్ఫర్మేటివ్ సర్జరీ (Transformative surgery)తో ఉపశమనం పొందగలిగారని కేర్ ఆసుపత్రి బంజారాహిల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ సయ్యద్ కమ్రాన్ హుస్సేన్ శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. 

ట్రాన్స్ఫర్మేటివ్ సర్జరీ (Transformative surgery) తరువాత వారు డయాబెటిస్ మందులు వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నట్లు డయాబెటిస్ (Diabetes) లేదా మెటబాలిక్ సర్జరీ (Metabolic surgery) అని పిలిచే ఈ సర్జరీని లాపరోస్కోపికల్గా పర్ఫార్మ్ చేస్తారు. ఈ సర్జరీలో భాగంగా హార్మోన్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి కడుపు, పేగులను తిరిగి మారుస్తారని కేర్ ఆసుపత్రి వైద్యులు డా. వేణుగోపాల్ పరీక్, సీనియర్ కన్సల్టెంట్ GI, లాపరోస్కోపిక్ & రోబోటిక్ బారియాట్రిక్ సర్జన్, ఈ రోజు విడుదల చేసిన ఓకే పత్రిక ప్రకటనలో తెలిపారు.  బెరియాట్రిక్ సర్జరీతో మధుమేహం దూరం అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నపుడు కొంతమంది పొట్టను తగ్గించుకోవడానికి సిద్ధమవుతారు. వ్యాయామం చేయడం, భోజనం తగ్గించినా పొట్ట ఇంచుకూడా తగ్గకపోవడంతో బెరియాట్రిక్ సర్జరీకి వెళ్తారు. అలా వెళ్లిన వారికి మధుమేహం కూడా పూర్తిగా తగ్గిపోతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మందులు ఏ మాత్రం వాడాల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు.

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

ఈ సర్జరీ చేయించుకున్న ఆ ముగ్గురు వినిత్ కుమార్ బన్షాల్ (35, M - ఒడిశా), వినయ్ కుమార్ బన్షాల్ (35, M - ఒడిశా), మదన్ చందర్ బారిక్ (45, M - ఒడిశా) వీరు కొద్దీ కాలంగా హై బి.పి, అధిక నియంత్రిత చక్కెర, ఊబకాయం కారణంగా వారికి వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, శ్వాస ఆడకపోవడం, రక్తపోటు, నిద్రలేకపోవడం, భారీ గురకతో సమస్యల తో బాధపడుతూ కొంతకాలంగా రోజూ మందులు వాడుతున్నా, వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రాకపోవటంతో  చివరికి ట్రాన్స్ఫర్మేటివ్ సర్జరీ (Transformative surgery)  చేయించుకుని వారి తగిన ఆరోగ్య సమస్యలు నుండి ప్రాణాలు కాపాడుకోగలిగారు అని కేర్ ఆసుపత్రి డా. వేణుగోపాల్ పరీక్, సీనియర్ కన్సల్టెంట్ GI, లాపరోస్కోపిక్ & రోబోటిక్ బారియాట్రిక్ సర్జన్ తెలిపారు.

Read More College I సాంకేతికతతో భోధన చేయాలి

ఊబకాయం అనేది శరీరంలో కొవ్వు నిల్వల పెరుగుదలతో కూడిన దీర్ఘకాలిక ప్రగతిశీల వ్యాధి. డయాబెటిస్ మెల్లిటస్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు భారీ వ్యయాన్ని కలిగించే మరొక పెద్ద మహమ్మారిగా మారింది. T2DM అభివృద్ధి మరియు అధిక బరువు లేదా ఊబకాయం మధ్య బాగా స్థిరపడిన లింక్ ఉంది. బారియాట్రిక్ శస్త్రచికిత్స అనేది స్థూలకాయం, T2DM ఉన్న రోగులకు బాగా గుర్తించబడిన, సమర్థవంతమైన చికిత్సా ఎంపిక, ఇక్కడ బారియాట్రిక్ సర్జరీ యొక్క ప్రయోజనాలు సాధారణ బరువు తగ్గడం కంటే ఎక్కువగా ఉంటాయి.

Read More Telangana I కనించని కుట్రలో తెలంగాణ పాటమ్మ

శస్త్రచికిత్స ప్రయోజనాలు
డా. వేణుగోపాల్ పరీక్, సీనియర్ కన్సల్టెంట్ GI, లాపరోస్కోపిక్ & రోబోటిక్ బారియాట్రిక్ సర్జన్ ప్రకారం, మధుమేహం శస్త్రచికిత్స అనేది అధిక HBA1c స్థాయిలు ఉన్న రోగులకు ఒక మంచి ఎంపిక. ఇది 2-3 నెలల్లో సగటు రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఫలితంగా జీవితకాలం పెరుగుతుంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది.

Read More TS_Assembly I అక్కడ... సీటు త్యాగాలకు సిద్ధమా.. రణమా!? శరణమా!?

Views: 0