జయభేరి, గజ్వేల్, అక్టోబర్ 06 :
బేగంపేట ఏఎస్ఐ అమృత్, కేసు వివరాలు తెలియపరుస్తూ ఆదివారం ఉదయం మక్తమాషానపల్లి బస్సు స్టాప్ నందు ఏఎస్ఐ అమృత్, సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేయుచుండగా ముగ్గురు వ్యక్తులు తుఫ్రాన్ నుండి గజ్వెల్ వైపు మోటర్ సైకిల్ పై వచ్చి మమ్మల్ని చూసి పారిపోవటానికి ప్రయత్నించగా వెంబడించి పట్టుకొని విచారించారు.
కమ్మరి నర్సింహాచారి గ్రామం నస్తీపూర్ హత్నూర మండల సంగరెడ్డి జిల్లా మరో ఇద్దరు మైనర్ పిల్లలు మొత్తం ముగ్గురు కలిసి గత నెల 21.09.2024 రోజున రాత్రి ఒంటి గంటకు మజీద్ పల్లి గ్రామం శాఖరం ఎక్స్ రోడ్ నుండి టీఎస్-36-8383 నెంబర్ గల బండిని దొంగిలించి నట్టు తెలిపారు.పై ముగ్గురి నిందితులపై కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించి కమ్మరి నర్సింహాచారి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించారు.పై నిందితులను పట్టుకోవడంలో చురుకుగా వ్యవహారిచిన ఏఎస్ఐ అమృత్ మరియు సిబ్బంది, కనకరాజు..సత్యనారాయణ ప్రదీప్ లను తొగుట సిఐ లతీఫ్ అభినందించారు.