ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి

రేఖ బోయలపల్లి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు 

ఇది ఎన్నికల ఆచరణ కాదు ఇది ప్రజాస్వామ్యంపై దాడి!

రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలు దేశ ప్రజలకు గమనించాల్సిన హెచ్చరిక

ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి

జయభేరి, స్టేషన్గన్పూర్ : ఓటర్ల జాబితాలు ప్రజలచే పరిశీలనకు నోచుకోకుండానే దాచివేయడం, ఈవీఎంలపై అడిగిన ప్రాథమిక ప్రశ్నలకు సమాధానాల లేమి, తాజాగా ఓటింగ్ వీడియో ఫుటేజ్‌ను 45 రోజుల్లో తొలగించాలని ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఇవన్నీ ఒకే దిశగా చూపుతున్నాయి.. పారదర్శకతను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఈవీఎంలలోనూ, మొత్తం ఎన్నికల వ్యవస్థలోనూ, ఏమీ తప్పు జరగలేదని అధికారపక్షం నమ్మిస్తుంటే ఆధారాల తొలగింపు వెనుక ఉద్దేశం ఏమిటి?

రాహుల్ గాంధీ  “ఫిక్స్‌డ్ మ్యాచ్” అన్న వ్యాఖ్యలు మౌలిక ప్రశ్నగా మారాయి. ప్రజల ఓటు హక్కును ఖూనీ చేసిన ఈ ప్రక్రియను బహిర్గతం చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ అనుభవంతోనే కాదు బాధ్యతతోనూ చెబుతోంది.
ఎన్నికల సంఘం తక్షణమే తన నిర్ణయాలను తిరిగి తీసుకోవాలి. ఈవీఎంలపై సమగ్ర స్వతంత్ర పరిశీలన జరగాలి.
ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఇది అవసరం.

Read More Medigadda I మేడిగడ్డ.. బొందల గడ్డ... భాష మార్చుకోకపోతే ప్రజలు చీదరిస్తారు!

Views: 1