హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం... శిక్షర్హం... పట్టణ ఎస్సై రజాక్... ట్రాఫిక్ ఎస్ఐ కే సుధాకర్...

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం... శిక్షర్హం... పట్టణ ఎస్సై రజాక్... ట్రాఫిక్ ఎస్ఐ కే సుధాకర్...

మోటారు వెహికల్ రాకపోకలు సాగించే సమయంలో వాహన చోదకులు బాధ్యతయుతంగా హెల్మెట్లు ధరించాలని బాపట్ల పట్టణ ఎస్సై రజాక్ అన్నారు..

బాపట్ల పాత బస్టాండు నందు గురువారం పేరా లీగల్ వాలంటీర్స్ ఆధ్వర్యంలో మోటర్ వాహనాల సంబంధిత చట్టాలపై అవగాహన కార్యక్రమానికి విచ్చేసిన బాపట్ల పట్టణ ఎస్సై రజాక్, ట్రాఫిక్ ఎస్ఐ కే సుధాకర్, ప్రజలకు మోటర్ వాహనాల సంబంధిత చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్ఐ రజాక్, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశాల మేరకు, బాపట్ల పట్టణ డిఎస్పి మురళీకృష్ణ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు..

Read More Ap DGP : రాజేంద్రనాథ్ ఔట్.. కొత్త డీజీపీ ఎవరు..!?

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం శిక్షర్హం మోటార్ వాహనాల చట్టాలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని అలాగే అతివేగంతో వాహనాలు నడపరాదని ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ఆ కుటుంబ జీవన ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలకు మోటర్ సైకిళ్లను ఇవ్వొద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Read More Raghu Ram-Babu : బాబుతో డీల్ ఓకే... అసెంబ్లీ బరిలోకి రఘురామ

Views: 1

Related Posts