Pawan : పవన్ కళ్యాణ్ ఐదేళ్ల సంపాదన ఎంతో తెలుసా?
- పవన్ కళ్యాణ్ ఐదేళ్ల ఆదాయం రూ. 114.76 కోట్లు. ప్రభుత్వానికి పవన్ చెల్లించిన పన్నులు రూ. 73.92 కోట్లు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు రూ. 20 కోట్లు. పవన్ కళ్యాణ్ అప్పులు రూ. 64.26 కోట్లు. ఆదాయపు పన్నుగా రూ. 47 కోట్లు, జీఎస్టీ రూ. 5 కోట్లు చెల్లించారు. వివిధ బ్యాంకుల నుంచి రుణాల్లో రూ. 17.56 కోట్లు తీసుకున్నారు.. వ్యక్తుల నుంచి రూ. 46 లక్షలు అప్పులయ్యాయి.
పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ (టాలీవుడ్)లోనే కాదు, తెలుగు రాష్ట్రాల (ఏపీ పాలిటిక్స్) రాజకీయాల్లో కూడా సంచలనం అని చెప్పుకోవచ్చు. సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా, ప్రజాసేవకుడిగా, ఆపద సమయంలో ఆదుకునే వ్యక్తిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రజల ప్రేమాభిమానాలను పొందుతున్నారు. జనసేన అధినేత పవన్ ఈసారి పిఠాపురం ఎమ్మెల్యేగా ఎన్నికల బరిలో నిలిచారు. దీనికి సంబంధించి మంగళవారం పాపన్ ఎన్నికల నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన ఆస్తులకు సంబంధించిన కీలక వివరాలను పొందుపరిచారు. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మీడియాతో మాట్లాడిన పవన్.. ప్రజలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల అరాచక పాలనకు స్వస్తి చెప్పేందుకే నామినేషన్ వేశామన్నారు. ప్రజలు తనను ఆశీర్వదించారని.. ఎన్నికల్లో విజయం ఖాయమన్నారు. 2047 తరానికి ఈ ఎన్నికలు ఎంతో కీలకమని.. ఏపీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే జనసేన తగ్గుముఖం పట్టిందని అన్నారు. 30 చోట్ల తమ అభ్యర్థులను ఉపసంహరించుకోవాలని చెప్పినట్లు పవన్ తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న వర్మ తన సీటును త్యాగం చేశారు. రానున్న కాలంలో వర్మకు మంచి స్థానం కల్పించేందుకు ప్రయత్నిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని పవన్ ధీమా వ్యక్తం చేశారు.


