మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి

  • ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలి
  • జనసేన అధినేత పవన్ కల్యాణ్ హితవు

మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలి

జయభేరి, అమరావతి, జూన్ 5 :
మరింత బాధ్యతతో జనసేన ఎంఎల్‌ఎలు కలిసి పని చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. జనసేన పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. గెలిచిన అభ్యర్థులను పవన్ అభినందించారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడారు. ఓటేసిన ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రజల ఆకాంక్షల మేరకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు.  జనసేన నూటికి నూరు శాతం విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. వైసిపిపై కక్ష సాధింపు చర్యలుండవని, వ్యవస్థల్లో రాజకీయ ప్రమేయం తగ్గిస్తామని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన పునాదులు నిర్మించేలా కూటమి పాలన ఉంటుందని పవన్ వివరించారు. చీకటి రోజులు పోయాయని, కలిసికట్టుగా పనిచేసే రోజులు వచ్చాయని తెలియజేశారు.

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

Social Links

Related Posts

Post Comment