ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ

ఘనంగా బండారు శ్రీను గురుస్వామి అయ్యప్ప పడిపూజ

జయభేరి, పరవాడ :
మండల కేంద్రం పరవాడ శివాలయం రోడ్డులో గల అయ్యప్ప స్వాముల పీఠం పీఠాధిపతి గురుస్వామి బండారు శ్రీను పెట్టుకున్న అయ్యప్పస్వామి పడిపూజ ఘనంగా జరిగింది.

అరటిడొప్పలతో తన పీఠం స్వాముల సహాయంతో తానే స్వయంగా అయ్యప్ప సన్నిదానాన్ని,పడిమెట్లను ఏర్పాటు చేసి రకరకాల పుష్పాలతో సన్నిదానాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి అందులో శివ పార్వతులు, గణేష్, సుభ్రమణ్యస్వామి, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి విగ్రహాలను ప్రతిష్ట చేసి కుందులతో దీపారాధన,నైవేద్యాలను సమర్పించి అయ్యప్ప శరణుఘోషలతో గురుస్వామి నాయుడు స్వామి మంత్రోశ్చరణలతో సన్నిదానంలో ని దేవతామూర్తులకు పూజపెట్టిన పీఠాధిపతి శ్రీను స్వామితో  పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజలు నిర్వహించారు. అనంతరం అయ్యప్ప విగ్రహానికి పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, గంధం, పసుపు, కుంకుమ, విభూది, నారికేల జలాభిషేకాలు నిర్వహించారు. 

Read More EC : ఎన్నికల ముందు జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

image0 (2)

Read More RAGHURAMARAJU I రఘురామరాజుకు నిరాశే!

అనంతరం సన్నిదానంలో ప్రతిష్టించిన దేవతామూర్తుల భక్తి గీతాలను అయ్యప్ప మాలధారకులు హుషారుగా ఆలపించారు.చివరగా నక్షత్ర హారతిని వెలిగించి అయ్యప్పకు సమర్పించిన పిదప శ్రీను స్వామి ఏర్పాటు చేసిన అల్పాహారం(సద్ది) ను స్వాములు బెత్తాయించారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ ఎస్ అప్పలనాయుడు, గురుస్వాములు గండి సన్నిబాబు, తేలు చలపతిరావు, జంగాల త్రినాధరావు, బండారు సతీష్, అల్లంపల్లి శివ, బండారు రామారావు, స్వామిలు, బండారు శ్రీను స్వామి కుటుంభ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Read More Changed Schools : మారిపోయిన స్కూళ్లు...

Views: 1

Related Posts