అంగన్వాడి బడిబాట-చిన్నారుల జీవితానికి పూలబాట
పౌష్టికాహారం ఆటపాటలతో బోధన... మిట్టపల్లె లో అంగన్వాడి బడిబాట ర్యాలీ
బడిబాట కార్యక్రమంలో చిన్నారులు తల్లిదండ్రులు, గ్రామ పెద్దలతొ కలసి ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి కేంద్రాలలో రెండున్నర సంవత్సరాల నుంచి ఐదేళ్లలోపు బడియుడు పిల్లల్ని తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు.
జయభేరి, ఆళ్లగడ్డ :
అంగన్వాడి బడిబాట కార్యక్రమం చిన్నారుల జీవితానికి పూలబాట అవుతుందని అంగన్వాడీ టీచర్ మౌనిక తెలిపారు. సోమవారం ఆళ్లగడ్డ మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఒకటవ అంగన్వాడి కేంద్రం టీచర్ మౌనిక ఆధ్వర్యంలో అంగన్వాడి బడిబాట కార్యక్రమం నిర్వహించారు.
తల్లిదండ్రులు అంగన్వాడీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. అంగన్వాడి బడిబాట కార్యక్రమం ద్వారా చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లులు అంగన్వాడీ సహాయకురాలు సంజమ్మ గ్రామస్తులు, గ్రామ పెద్దలుతదితరులు పాల్గొన్నారు.
Post Comment