samantha - naga chaitanya : సమంత.. నాగ చైతన్యపై షాకింగ్ పోస్ట్

తెలుగు ఇండస్ట్రీలో సమంత -నాగచైతన్య జంట బెస్ట్ పెయిర్‌గా నిలుస్తుందని అందరు భావించారు.

samantha - naga chaitanya : సమంత.. నాగ చైతన్యపై షాకింగ్ పోస్ట్

సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినా నిత్యం వార్తల్లో నిలుస్తోంది. నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. విజయ్ దేవరకొండతో 'ఖుషి' సినిమా తర్వాత సమంత ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది. ఆర్యోగం సహకరించకపోవడంతో సమంత సినిమాల్లో నటించడం మానేసింది. అయితే తాజాగా ఆయన వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ టైటిల్ ను ప్రకటించారు. ఈ వెబ్ సిరీస్ టైటిల్ ``హనీ, బన్నీ` అని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమాలో సమంత హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసినట్లు సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత బన్నీ తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అట్లీకి కథ నచ్చడంతో సమంత వెంటనే ఈ సినిమాకు అంగీకరించిందట.

c7deda67775488d81640c94bc4ca138739764

Read More Ram Charan's Net Worth : రామ్ చరణ్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?

ఇదిలా ఉంటే హీరో నాగ చైతన్య, హీరోయిన్ సమంతల మధ్య అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. సమంత, నాగ చైతన్య జంట తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ పెయిర్ అని అందరూ అనుకున్నారు. అయితే సమంత, నాగ చైతన్య మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిగా జీవనం కొనసాగిస్తున్నారు. విడాకుల తర్వాత తొలిసారి సమంత, నాగ చైతన్య కలిసి ఒకే వేదికపై దర్శనం ఇచ్చారు. ముంబైలో అమెజాన్ ప్రైమ్ ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించింది.

Read More anupama parameswar kiss : అనుపమ కిస్సుల గోల..

విడాకుల తర్వాత సమంత, నాగ చైతన్య మొదటి సారి ప్రమోషన్ ఈవెంట్‌లో భాగమయ్యారు. సమంత, నాగ చైతన్య దర్శనం ఇవ్వడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సమంత, నాగ చైతన్య సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా సమంత తన సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ను షేర్ చేసింది. నువ్వు లేకుండా నేను ఏం చేయగలను అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాసింది. దీంతో నాగ చైతన్య, సమంత మరోసారి కలవబోతున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read More Samantha.. Naga Chaitanya I నాగ చైతన్యకి సారీ చెప్పిన సమంత?

Views: 0

Related Posts