నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసిన నటి సోనాలి బింద్రే...!

నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసిన నటి సోనాలి బింద్రే...!

ఒకప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ నటి సోనాలిబింద్రే నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. ఒకానొక సమయంలో సోనాలిబింద్రే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లోని పెద్ద హీరోలందరితోనూ నటించింది. ఆమె నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలందరితోనూ నటించింది. బాలీవుడ్‌లో కూడా ఆమె నటించిన చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి. అయితే ఆ తర్వాత సోనాలి సినిమాలకు దూరంగా ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

'ది బ్రోకెన్ న్యూస్' సీజన్ 2 వెబ్ సిరీస్‌తో సోనాలి మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి సోనాలి నిర్మాతలపై పలు వ్యాఖ్యలు చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రూమర్స్‌ సృష్టించేది నిర్మాతలని.. బాడీ షేమ్‌ చేసేది నిర్మాతలని ఆమె అన్నారు. నిర్మాతలంటే రూమర్స్ క్రియేట్ చేసే వారు.. నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేనాటికి చాలా తేడా ఉండేది. నిర్మాతలు నాకు, నా తోటి నటీనటులకు మధ్య రూమర్స్‌ సృష్టించేవారు. వాటిలో నిజం లేకపోయినా సినిమాను ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తున్నారు. నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో ఈ చెత్త ట్రెండ్ ఇంకా కొనసాగుతోంది. నిర్మాతలు మీడియాకు రూమర్స్ లీక్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి షాక్ అయ్యాను అని సోనాలిబింద్రే తెలిపింది. నిర్మాతలు తనను బాడీ షేమ్ చేసేవారని కూడా చెప్పింది.

Read More ఆ బోల్డ్ సెక్స్ సీన్ అందుకే చేయాల్సి వచ్చింది.. మగాళ్లంటే ఇష్టం లేకే..: సోనాక్షి సిన్హా

దీని వల్ల నిర్మాతలు నన్ను బాడీ షేమ్ చేసేవారు. నా మీద జోకులు వేసేవారు. అప్పట్లో హీరోయిన్లందరూ కాస్త లావుగా ఉండేవారు. అలాగే ప్రిపేర్ అవ్వమని చెప్పేవారు. కానీ, వారి మాటలను నేనెప్పుడూ పట్టించుకోలేదు. అభిమానులు నన్ను ఎలా ఉన్నారో అలాగే అంగీకరించారు. స్టార్ హీరోయిన్ ని చేశామన్నారు.

Read More Nayani Pavani : మనసేమో ఆగదు.. క్షణం కూడా! బిగ్ బాస్ బ్యూటీ మిస్ అయింది

Social Links

Related Posts

Post Comment