బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం

  • ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు.

బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం

రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఫార్మా కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆరుగురు కార్మికుల ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ ను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తల్లిదండ్రులతో కలిసి సాయిచరణ్ సీఎంను కలిశారు. కార్మికులను కాపాడటంలో ప్రదర్శించిన తెగింపు వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. బాలుడి ధైర్య సాహసాలకు ముగ్ధుడైన సీఎం పుష్పగుచ్చం అందించి అభినందించారు.