పారామిలిటరీ బలగాల్లో అత్యుత్తం సీఆర్పీఎఫ్
- సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలు సేవలను మరువలేం
- ఉగ్రవాద మావోయిస్టుల నిర్మూలనలో సీఆర్పీఎఫ్ పాత్ర కీలకం
- అత్యాధునిక ఆయుధాలను అందిస్తాం
- కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
జయభేరి, హైదరాబాద్ :
జమ్మూ కాశ్మీర్ సహా దేశంలోని ఉగ్రవాదం, వేర్పాటువాదం ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదంతోపాటు మావోయిస్టుల ఏరివేతలో సీఆర్పీఎఫ్ బలగాలు చూపుతున్న తెగువ అద్బుతమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. దేశంలోని అంతర్గత శాంతి భద్రతలను పరిరక్షించడంలో సీఆర్పీఎఫ్ ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. దేశ అంతర్గత భద్రత విషయంలో సీఆర్పీఎఫ్ బలగాల త్యాగాలను వెలకట్టలేనివని అభివర్ణించారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైనవారికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించారు. సిఆర్.పీ.ఎఫ్. జవాన్లు తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ భద్రత కోసం, ప్రత్యేకించి తీవ్రమైన దుర్భర ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ మాతృభూమికి అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. వారి సేవలను ద్రుష్టిలో ఉంచుకుని జవాన్లకు, అధికారులకు వారి కుటుంబాలతో నివసించేందుకు వీలుగా గృహ నిర్మాణాల్ని నిర్మిస్తున్నాం. ఈ గ్రుహ నిర్మాణాల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది. అందులో భాగంగానే జంషేడ్ పూర్ లోని సీఆర్పీఎఫ్ గ్రూప్ కేంద్రంలో 165 ఎకరాల విస్తీర్ణంలో నిర్మితమైన 480 టైప్-2, 24 టైప్-3 కుటుంబ ఆవాసాలతోపాటు భండార్ భవనం, ట్రేడ్స్‌మెన్ షాప్, 20 బెడ్ల ఆసుపత్రి, అధికారుల మెస్, 180 మందికి సరిపడా మెయిన్ బ్యారక్ లను నిర్మించడంతోపాటు నా చేతుల ద్వారా వాటిని ప్రారంభించడాన్ని గర్వంగా భావిస్తున్నాను. విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు తమ కుటుంబాలను సురక్షిత వాతావరణంలో ఉంచి, పిల్లలకు మంచి విద్య అందించడంలో వీలు కల్పించి, ఎటువంటి ఆందోళన లేకుండా దేశ సేవలో మునిగిపోవడానికి ఈ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి.