స్టేట్ బ్యాంక్ ఆఫ్ దేవరకొండ లోన్ మేళా

స్టేట్ బ్యాంక్ ఆఫ్ దేవరకొండ లోన్ మేళా

దేవరకొండ :
పెన్షనర్స్ సేవాసదనం దేవరకొండ యందు నేడు ఉదయం  స్టేట్ బ్యాంక్ అఫ్ దేవరకొండ వారు ప్రభుత్వ పెన్షదారులకు లోనుపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారని అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి జరిగిన కార్యవర్గం సమావేశంలో తెలిపినారు. 

కావున అందరు సర్వీస్, ఫ్యామిలీ పెన్షనర్స్ అందరు రేపు జరుగు లోన్ అవగాహన సదస్సుకు హాజరుకాగలరని కోరినారు. లోన్ కొరకు కావాలసిన పత్రములు, వడ్డీ ఎంత ఎంత లోన్ ఇస్తారు, ఎన్ని నెలలు రికవరీ చేస్తారు మొదలగు విషయములపై బ్యాంకు అధికారులు అవగాహన కలిగిస్తారు. కావున మిత్రులు అధికసంఖ్యలో హాజరై వివరములు తెలుసుకోగలరని కోశాధికారి పంగునూరు లింగయ్య తెలిపినారు. ఈ కార్యక్రమంలో సహా అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్, జిల్లా కార్యదర్శి కంచర్ల నారాయణ రెడ్డి, ఆడిటర్ వనం బిచ్చయ్య, కార్యవర్గం సభ్యులు పాల్గొన్నారు.

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు