Congress : పీర్జాదిగూడలో సునీత మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు
తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభం. రికార్డు మెజార్టీతో సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తాం
- పీర్జాదిగూడ 1వ డివిజన్ లోని ఏవీ ఇన్ఫొప్రైడ్ లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి ఆధ్వర్యంలో పీర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు ఈ నేపథ్యంలో పీర్జాదిగూడ 1వ డివిజన్ లోని ఏవీ ఇన్ఫొప్రైడ్ లో గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జి తోటకూర వజ్రెష్ యాదవ్, మాజీ శాసనసభ్యులు మలిపెద్ది సుదీర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ... మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏవీలో గల విజయగణపతి, పురాతన శివాలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం శుభ పరిణామం అని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారెంటీలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో సునీత మహేందర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజార్టీతో గెలిపిస్తామని అందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పోరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు,కో ఆప్షన్ మెంబర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Post Comment