Revanth Reddy : బాచుపల్లి ఘటనపై రేవంత్ ప్రశ్నించారు
- భవనం పక్కనే ఉన్న సెంటర్‌లో పనిచేస్తున్న కూలీల్లో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. మృతులు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నాలుగేళ్ల బాబు, ఒక మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారని అధికారులు రేవంత్‌కి తెలిపారు.
హైదరాబాద్:
రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మృతి చెందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా గోడ కూలిపోయిందని అధికారులు రేవంత్‌కి తెలిపారు. భవనం పక్కనే ఉన్న సెంటర్‌లో పనిచేస్తున్న కూలీల్లో ఏడుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయని తెలిపారు. మృతులు ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. మృతుల్లో నాలుగేళ్ల బాబు, ఒక మహిళ, ఐదుగురు పురుషులు ఉన్నారని అధికారులు రేవంత్‌కి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.
Latest News
11 Mar 2025 10:44:11
జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ
Post Comment