Revanth Reddy : హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి
- హుజూరాబాద్ జనజాతర బహిరంగసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.
👉కరీంనగర్ జిల్లా చైతన్యవంతమైనది. ఎర్రజెండా నీడలో ఎంతో మంది విప్లవకారులు ఈ జిల్లా నుంచి పోరాటాలు చేశారు.
👉చింతమడక నుంచి వచ్చిన కేసీఆర్ కు కరీంనగర్ ప్రజలు అండగా నిలబడ్డారు.
👉కరీంనగర్ ను వదిలి కేసీఆర్ మహబూబ్ నగర్ వస్తే మేం ఆలోచించకుండా గెలిపించాం.
👉సెమీఫైనల్ లో కేసీఆర్ ను చిత్తు చిత్తు చేశాం. ఫైనల్స్ లో తెలంగాణ పౌరుషం గుజరాత్ కు తెలిసే విధంగా మోడీని ఓడించాలి.
👉 పదేళ్లు ప్రధాని గా ఉన్న మోదీ తెలంగాణ కు ఇచ్చింది ఏమీ లేదు. బండి సంజయ్ కరీంనగర్ జిల్లాకు తెచ్చింది ఏమీ లేదు
👉 పునర్వీభజన చట్టంలోని ఏ అంశాలను కూడా అమలు చేయలేదు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంటులో తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలను అవమానించేలా మోదీ మాట్లాడారు.
👉 తెలంగాణను అవమానించిన బీజేపీకి, బండి సంజయ్ కు ఓటు వేయాలా కరీంనగర్ లో అరగుండు, నిజమామాబాద్ లో గుండు రాష్ట్రానికి తెచ్చిందేం లేదు.
👉 తెలంగాణ కు పదేళ్లు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు. కర్ణాటక కు చెంబు, ఎపీకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం.
👉 అయోధ్య లో రాముడి కళ్యాణానికి 15 రోజుల ముందే అక్షింతలు పంచారు. ఇది శ్రీరాముడిని అవమానించడమే.
👉 హిందువులందరూ ఆలోచించాలి. రాజకీయాల కోసం రాముడిని వాడుకుంటున్నారు.
👉 నేను హిందువును. కాని ఓట్ల కోసం హిందుత్వాన్ని వాడుకోం. దేవుడు గుడిలో ఉండాలి. భక్తి గుండెల్లో ఉండాలి.
👉 రాముడి పేరు చెప్పుకొని ఓట్లు అడుకునే దిక్కుమాలిన పరిస్థితి కరీంనగర్, నిజామాబాద్ లో ఉంది.
👉 బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేయడానికి కుట్ర చేస్తోంది. నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని సవరించాలన్నదే బీజేపీ కుట్ర.
👉 బీజేపీ ప్రభుత్వంలోకి వస్తే ఎస్సీ,ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి.
👉 కులగణనను బీజేపీ ఎందుకు వ్యతిరేకిస్తుందో మోదీ సమాధానం చెప్పాలి. తెలంగాణకు వస్తున్న మోదీ రిజర్వేషన్లపైన సమాధానం చెప్పాలి.
👉 బీజేపీని ఓడిస్తేనే రిజర్వేషన్లు కొనసాగుతాయి. దళితులు, బడుగు బలహీనవర్గాలపైన మోదీ సర్జికల్ స్ట్రైక్ చేస్తడు.
👉 నేను రిజర్వేషన్లపైన మాట్లాడితే ఢిల్లీ నుంచి వెంటనే పోలీసులు వచ్చారు.
👉 పదేళ్లు కేసీఆర్ నన్ను వేధించి కేసులు పెట్టి జైలుకు పంపాడు. చివరకు ఏమైంది నడుం ఇరిగి మూలకు పడ్డాడు.
👉 కారు కరాబు అయి కార్ఖానాకు పోయింది. మూలకుపడింది. కారు మూలకు పడింది కాబట్టే కేసీఆర్ బస్సు ఎక్కాడు. తిక్కలోడు తిరనాళ్లకు పోయినట్లు కేసీఆర్ బస్సు యాత్ర ఉంది.
👉 బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం జరిగింది. మహబూబ్ నగర్, చేవేళ్ల, భువనగిరి, కరీంనగర్,మల్కాజ్ గిరి లాంటి సీట్లలో బీజేపీని గెలిపించాలని కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు.
👉 నల్గొండ, మెదక్ లాంటి సీట్లలో బీఆర్ఎస్ ను గెలిపించాలన్నది బీజేపీ ప్రయత్నం.
👉 కేసీఆర్ ను ఇండియా కూటమిలోకి రానివ్వం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ గోడ మీద వాలినా కాల్చి అవతలపారేస్తం.
👉 12 సీట్లతో బీఆర్ఎస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా?
👉 బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు చూసే కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ కు మద్దతునిచ్చాయి.
👉 కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ నిరుద్యోగులకు మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం.
👉 రామప్ప దేవాలయంలో ఉన్న శివుడి సాక్షిగా మాట ఇస్తున్న ఆగస్టు 15 లోగా రుణ మాఫీ చేస్తా.
👉 వెలిచాల రాజేందర్ రావును కరీంనగర్ ఎంపీగా లక్ష మెజార్టీతో గెలిపించాలి.


