PMC : పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం... ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయాలి
రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది.
జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పీర్జాదిగూడ కమాన్ నుండి పర్వతాపురం వరకు ఆగిపోయిన రోడ్డు పనులు వేగవంతంగా పూర్తి చేయించాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి... పిఎంసి కమిషనర్ తో, సంబంధించిన అధికారులతో మాట్లాడి... అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులతో... విద్యుత్ శాఖ అధికారులని పిలిపించి... రానున్నది వర్షాకాలం కావున ప్రజలకు ఇబ్బంది జరగకూడదని ఆలోచనతో ఆగిపోయిన రోడ్లను పరిశీలించి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే మొదలు పెట్టాలని కమిషనర్ ని ఆదేశించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి, కార్పొరేటర్ మడుగుల చంద్రకళ చంద్రారెడ్డి, వంగూరి పరమేష్, మోహన్ కుమార్, కొల్తూరి కుమార్, రవి యాదవ్, ప్రభంజన్, విక్రమ్ గౌడ్, శ్రీకాంత్ పటేల్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post Comment